తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 4 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. విశ్వనగరంలో బీఆర్ఎస్ పాలన కుక్కలు బాలునిపై దాడి చేసి చంపే వరకు వచ్చింది. ప్రభుత్వం బాలుడి కుటుంబాన్ని ఆదుకోకుండా చేతులు దులుపుకుంది. కుక్కలు ఆకలితో ఉండడం వల్లే బాలుడిని తిన్నాయని మేయర్ చెబుతుంటే..కుక్కలకు కు.నీ ఆపరేషన్ చేయిస్తామని మంత్రి అంటున్నారు. అక్కడ జరిగింది ఒకటైతే ప్రజాప్రతినిధులు మరోలా చెబుతున్నారని రేవంత్ (Revanth Reddy) ఫైర్ అయ్యారు.
BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి సరికొత్త ప్లాన్.. కుమారుడికి కోసం ఆ సీటుపై కన్ను
అంతేకాదు బీఆర్ఎస్ పాలన కుక్కల పాలన..మున్సిపల్ శాఖా మంత్రిగా కేటీఆర్ ఫెయిల్ అయ్యారు. బాలుడిని కుక్కలు చంపేసిన ఘటనలో కేవలం స్వారీ చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మనుషులు చనిపోతే కుక్కలకు కు.నీ ఆపరేషన్ ఏంటని రేవంత్ (Revanth Reddy) అన్నారు. రోడ్డు మీద కుక్కలు మనుషులను పీక్కుతినే రోజులు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చాయి. 4 ఏళ్ల బాలుడిని కుక్కలు చంపేస్తే ప్రభుత్వం కనీసం మానవత్వంతో ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రదీప్ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆదుకోవాలని అన్నారు.
పసి ప్రాయం. ఆటంటే సరదా. ఇక ఇంటి నుంచి బయటకొస్తే చిన్నపిల్లలకు ఉండే సంతోషమే వేరు. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి మించిన ఆనందం వారి మొహంలో ఎప్పుడు కనపడదు. ఆ మొహంపై చిరునవ్వు తప్ప మనస్సులో ఇసుమంత కల్మషం లేని పసి వయసులో 4 ఏళ్ల బాలుడిని విధి వక్రీకరించింది. అభం శుభం తెలియని ఆ బాలుడు వీధి కుక్కల దాడిలో గాయపడి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటు చేసుకుంది.
ఈ ఘటన మరవకముందే ఇవాళ కూడా చైతన్యపురిలో అలాగే కరీంనగర్ లోని పలు చోట్ల కుక్కలు చిన్నారులపై దాడులకు పాల్పడ్డాయి. దీనితో కుక్కల స్వైర విహారం ఇప్పుడు పిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది. ఇక హైదరాబాద్ లో 500 కుక్కలను అధికారులు పట్టుకున్నారు. ఇక మిగతా కుక్కల కోసం అధికారులు వేట
కొనసాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Mp revanthreddy, Telangana