కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) మూడు రోజులు తెలంగాణలో పర్యటించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరధిలో పర్యటించిన మంత్రి అక్కడి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకున్నారు. రేషన్ షాపులను సందర్శించారు. అక్కడ పంపిణీ అయ్యే ఉచిత బియ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తన ప్రశ్నలకు జవాబులు సరిగా ఇవ్వని కలెక్టర్‌పై ఆమె ఫైర్ అయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ మూడు రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆమెకు ఓ బహిరంగ లేఖ (Open letter) రాశారు. ఈ లేఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్నే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నీ సైతం టార్గెట్ చేశారు రేవంత్.
ప్రధాని మోదీ ఫొటో (PM Narendra Modi Photo) రేషన్ కార్డులపై లేదని పంచాయితీ చేయడం కేంద్రమంత్రిగా మీ స్థాయికి తగినట్టు లేదని ఎంపీ (MP) విమర్శించారు. తెలంగాణలో కేంద్రమంత్రి ప్రవర్తిస్తున్న తీరు.. అందుకు ప్రతిగా రాష్ట్ర మంత్రులు వ్యవహరిస్తున్న విధానం కూడా అభ్యంతరకరంగా ఉందని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిర్మలా సీతారామన్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరం అని తెలిపారు.
జాతీయ విపత్తు సహాయ నిధి (National Disaster Relief Fund) నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని రేవంత్ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ పనులు మూలన పడ్డాయని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో కేంద్రానికి ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో బయట పెట్టాలని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ (KCR) అండ్ కో విషయంలో కేంద్రం ఎందుకు ఔదార్యం ప్రదర్శిస్తున్నదో తెలపాలని డిమాండ్ చేశారు. మీ ఇద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో వెల్లడించాలని ఆ లేఖలో పేర్కొన్నారు రేవంత్.
TRSLP Meeting: ఆద్యంతం ఆసక్తికరంగా టీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఈడీ, సీబీఐలపై KCR హెచ్చరిక
8 సంవత్సరాల్లో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు కేసీఆర్ (KCR) ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేశాయని రేవంత్ ఆరోపణలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వీధి నాటకాలకు తెర లేపడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ తెలిపారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మీది కాదా? అంటూ ఆర్థిక మంత్రికి ప్రశ్నలు సంధించారు రేవంత్. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వానిదే కదా.. అంటూ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirmala sitharaman, Revanth Reddy, Telangana