కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి... ఆలోచిస్తేనే భయమేస్తోందన్న రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

Kondapochamma sagar canal breaches: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదు రెండు ప్రధాన కాలువలు గండ్లు పడ్డాయని రేవంత్ రెడ్డి అన్నారు.

  • Share this:
    ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోనే, కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చిన్న కాలువల పరిస్థితి ఇలా ఉంటే ఇక సర్ ఫేస్‌లో నిర్మించిన 50 టీఎంసీల మల్లన్న సాగర్, 15టీఎంసీ ల కొండపోచమ్మ సాగర్, గందమల్ల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఆలోచిస్తేనే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదు రెండు ప్రధాన కాలువలు గండ్లు పడ్డాయని రేవంత్ రెడ్డి అన్నారు.

    ఆ జలాశయాలకు ఇలాగే గండిపడితే ఒక్క ఊరు మిగలదని.. వాటి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు జలవిలయంలో కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్, మేఘ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపలే పరాకాష్ట అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని.. అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ చేత ఈ పనులపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
    First published: