Home /News /telangana /

REVANTH REDDY ARREST AT HIS HOUSE WHILE GOING TO ERRAVALLI VRY

Revanth reddy : రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్.. పోలీసులు, కార్యకర్తల తోపులాట.. చినిగిన చొక్కాలు...

revanth reddy arrest

revanth reddy arrest

Revanth reddy : కాంగ్రెస్ నేతలతో కలిసి ఎర్రవెల్లికి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్యలను అరెస్ట్ చేశారు.

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎర్రవెళ్లికి బయలుదేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అయినా బలవంతంగా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ తోపులాటలో టిపిసిసి ఉపాధ్యాక్షుడు మల్లు రవిని పోలీసులు నెట్టివేశారు. దీంతో ఆయన కిందపడడంతో స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఈ సంధర్భంగా ఆయన చొక్క కూడా చినిగిపోయింది.. కాగా పోలీసులను అడ్డుకున్న మల్లు రవితో మరికొంతంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా గత రాత్రి నుండే పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.ర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియా కు చూపిస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి. దీంతో పరిస్థితి ఉద్రిక్తం

  కాగా రెవంత్ రెడ్డి అరెస్ట్ ను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు..  దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేయకుండ అడ్డు కోవడం, పోలీసులతో నిర్బంధం ప్రయోగించడం గత ఎనిమిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలకులు అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదన్నారు. టిఆర్ఎస్ నియంతృత్వ, నిరంకుశ పరిపాలనపై ఇక తెలంగాణ ప్రజలు ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పోలీసులతో నిర్బంధం ప్రయోగించి భావవ్యక్తీకరణ ఆపాలనుకోవడం సర్కార్ పెద్ద పొరపాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  Bandi sanjay : ఇక్కడ.. దీక్ష చేస్తే అభ్యంతరం ఏమీటి.. నిరుద్యోగ దీక్షలో బండి సంజయ్, ఈటల


  కేంద్ర పోలీసులు హౌస్ అరెస్టు చేస్తే వరి ధాన్యం కొనుగోలు పై సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేవారా అని ప్రశ్నించారు. ధర్నాల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం? ప్రతిపక్షాలకు మరో న్యాయమా? ప్రజాస్వామ్య పాలనలో ఇదేం పద్దతి అని టిఆర్ఎస్ సర్కార్ ను నిలదీశారు. రచ్చబండ కు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు టిఆర్ఎస్ ధర్నాలను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. TRS ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు చేస్తే పోలీసుల చేత అరెస్టు చేయించాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

  maoist encounter : సరిహద్దుల్లో టెన్షన్... పట్టున్న ప్రాంతాల్లో మావోలకు తెరపడినట్లేనా..?


   ఇప్పటివరకు రైతులు వరి వేయొద్దు అని ఏ రాష్ట్ర సర్కార్ చెప్పలేదన్నారు. మొట్ట మొదటిసారిగా తెలంగాణ సర్కార్ చేతగానితనంతో వరి వేస్తే ఉరి అని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావాలని, ఆహార ఉత్పత్తి పెంచాలని, ఆహారధాన్యాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. కానీ, ఆ బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో వరి పండించొద్దని ప్రభుత్వం పోలీసులు, అధికారులతో రైతుల పై ఒత్తిడి చేయించడం దుర్మార్గమని ధ్వజ మెత్తారు.
  గత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన నీటి వనరులతో రైతులు వరి పంటలు పండిస్తారని,. యాసంగి లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని. అన్నదాతలు అధైర్యపడొద్దని. ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ టీఆర్ఎస్ సర్కార్ లపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని ప్రకటించారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Revanth reddy, TS Congress

  తదుపరి వార్తలు