Home /News /telangana /

REVANTH REDDY AND ETALA RAJENDER CRITICIZE TRS GOVERNMENT ON FOOD POISONING IN EDUCATIONAL INSTITUTIONS PRV

Food poison in Schools: పురుగుల అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటాలాడుతారా?

ఈటల, రేవంత్​ (ఫైల్​)

ఈటల, రేవంత్​ (ఫైల్​)

ఇటీవలె తెలంగాణలోని పలు చోట్లా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్​ పాయిజనింగ్​  ఘటనలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

    ఇటీవలె తెలంగాణలోని  (Telangana) పలు చోట్లా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్​ పాయిజనింగ్​ (Food poisoning)  ఘటనలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్​ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా రేవంత్​ రెడ్డి, ఈటల రాజేందర్​లు ఈ విషయంపై స్పందించారు. సీఎం కేసీఆర్ (CM KCR) పురుగుల అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చేలగాటం ఆడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మండిపడ్డారు. భోగాలు తప్ప.. త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అని ప్రశ్నించారు. పేదబిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి అని రేవంత్ ట్వీట్ చేశారు . ఒకసారి భోజనం తినే ముందు కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అంతేకాకుండా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala rajendar)​ కూడా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.  హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈటల ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ హై కమాండ్ తనకు అప్పచెప్పిందని తెలిపారు.

    బీజేపీ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నట్లు, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలువాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారన్నారు. నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే నోటితో పీకుతానన్నారు. తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూళ్లు అధ్వాన్నంగా తయారైనట్లు విమర్శించారు. ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్లు, విద్యార్థులు తినే ఆహారంలో వానపాములు, బొద్దింకలు వస్తున్నాయన్నారు.

    కాంట్రాక్టర్ లకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదన్నారు. మంత్రులు స్వతంత్రంగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదన్నారు. ఫామ్ హౌస్ లేకుంటే ఢిల్లీలో కేసీఆర్ ఉంటుండటంతో కనీస పర్యవేక్షణ చేసే వారు లేరని విమర్శించారు. ఇప్పటి వరకు స్కూల్స్ లో బుక్స్ ఇవ్వలేని దుస్థితి తెలంగాణలో నెలకొందన్నారు.



    గిరిజన బాలికల పాఠశాలలో..

    ఇటీవల మహబూబాబాద్​లో గిరిజన బాలికల పాఠశాలలో ఫుడ్​ పాయిజన్​ జరిగింది. దీంతో నలుగురు విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. తాము తిన్న ఆహారంలో వానపాము కన్పించిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో ఇటీవల కాలంలో పుడ్ పాయిజన్ ఘటనలు నమోదౌతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ లో పుడ్ పాయిజన్ కారణంగా ఓ విద్యార్ధి చనిపోయాడు.

    వరంగల్ జిల్లాకు చెందిన మరో విద్యార్ధి ఇంకా అనారోగ్యంగానే ఉన్నాడు. ఈ నెల 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ జరిగింది. వందల మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఈ పుడ్ పాయిజన్ తో విద్యార్ధులు ఆందోళనకు కూడా సిద్దమయ్యారు.బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ పై విచారణ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట సిద్ధిపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Eetala rajender, Food, Revanth Reddy, Schools, Telangana Government, Trs

    తదుపరి వార్తలు