హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రకు 4 రోజులు బ్రేక్.. ఇదే అసలు కారణం

Telangana Congress: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రకు 4 రోజులు బ్రేక్.. ఇదే అసలు కారణం

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో కాంగ్రెస్(Congress) పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం మరింత దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పూర్తి సమ యాన్ని ఇక్కడనే కేటాయిస్తున్నారు. ఐదు రోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చి సీఎల్పీ నేత భట్టి పాదయాత్రను ప్రారంభించిన ఠాక్రే.. తిరిగి ఈ నెల 23న రాష్ట్రానికి రాబోతున్నారు. వరసగా ఐదు రోజులు ఇక్కడే ఉండి పార్టీ బలోపేతానికి తీసుకునే కార్యక్రమాలు, హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,(Revanth Reddy) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న యాత్రలపైన సమీక్ష చేయనున్నారు. వీరితో పాటు టీపీసీసీ అనుబంధ సంఘాలతోనూ సమావేశమై పార్టీ బలోపేతానికి చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపైన చర్చించే అవకాశం ఉంది.

ఠాక్రే ఈ నెల 23న ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శులతో గాంధీ భవన్లో సమావేశం కానున్నారు.24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు టీ పీసీసీ అనుబంధ విభాగమైన ఫిషర్మెన్ కమిటీతో, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరుక యూ త్ కాంగ్రెస్ నాయకులతోనూ సమావేశం అవుతారు.

25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్పోరేటర్స్, మాజీ కార్పోరేటర్స్, కార్పోరేషన్లో పోటీ చేసిన అభ్యర్థులతోనూ పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. అదే రోజు సాయం త్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు హాత్ సే హాతో జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అండర్-19, ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో గెలుపొందిన విజేతలకు ఎల్బీ స్టేడియంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.

MLC Kavitha : ఈడీనే కవిత ప్రశ్నించారా..? అసలు లోపల ఏం జరిగిందంటే?

TS New Jobs: తెలంగాణలో మరో 1540 ఉద్యోగాలు .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..

26న ఉదయం గాంధీభవన్లో పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి చేపట్టే హాత్ సే హాత్ జోడో అభయాన్ కార్యక్రమానికి హాజరవుతారు. 27న ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి నాగ్‌పూర్ బయలుదేరి వెళతారు.

First published:

Tags: Congress, Telangana

ఉత్తమ కథలు