• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • REVANT REDDY MADE FALSE ALLEGATIONS AGAINST MINISTER KTR BN

ప్రజలంతా ఓవైపు ఉంటే.. రేవంత్ టీమ్ మరోవైపు.. టీఆర్ఎస్ నేతలు

ప్రజలంతా ఓవైపు ఉంటే.. రేవంత్ టీమ్ మరోవైపు.. టీఆర్ఎస్ నేతలు

గోపన్‌పల్లిలో దళితుల భూములను లాక్కున్న వ్యక్తి రేవంత్ అని, దానిపై ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. ఎదుటి వారిపై బురద జల్లడం ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు.

గోపన్‌పల్లిలో దళితుల భూములను లాక్కున్న వ్యక్తి రేవంత్ అని, దానిపై ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. ఎదుటి వారిపై బురద జల్లడం ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు.

  • Share this:
    టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గోపన్‌పల్లిలో దళితుల భూములను లాక్కున్న వ్యక్తి రేవంత్ అని, దానిపై ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. ఎదుటి వారిపై బురద జల్లడం ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. 111 జీవో పరిధిలోని వట్టినాగులపల్లిలో రేవంత్ బాగోతం బయట పెడతామని, సర్వే నెంబర్ 66/ఈలో రేవంత్‌ రెడ్డి బావమరిది జయప్రకాష్ రెడ్డి అక్రమ కట్టడాలు కడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ చూపెట్టిన భూములు కేటీఆర్‌వి కావని, కేటీఆర్ ఎదుగుదలను జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారని తెలిపారు. వట్టి నాగులపల్లిలో నీ పేరు, మీ బంధువుల పేర్ల మీద ఉన్న భూములపై ముందు సమాధానం చెప్పాలంటూ రేవంత్‌ను ఉద్దేశించి డిమాండ్ చేశారు.

    సంచలనాలు కోసమే రేవంత్ మాట్లాడతారని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. జాతీయ పార్టీకి ఇలాంటి నాయకుడి అవసరం ఉందా..? ఆలోచించండి అంటూ వ్యాఖ్యనించారు. టీఆర్ఎస్ నాయకులం ధర్మానికి కట్టుబడి ఉన్నామని, కోర్టులంటే మాకు గౌరవం ఉందని, ప్రజలంతా ఒకవైపు ఉంటే.. రేవంత్ టీం అంతా ఓవైపు ఉంటుందని, రేవంత్ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం మానుకోవాలని సూచించారు. 111 పరిధిలో మా పార్టీ నాయకుల ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయని వీహెచ్ చెప్పారని, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగనే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహారం ఉందని, రేవంత్ మాటలు ఎవరూ పట్టించుకోరని చెప్పారు. పెయింటర్‌గా పనిచేసిన రేవంత్.. రూ.వేల కోట్లు ఏలా సంపాదించారని, జైలుకెళ్లి క్రిమినల్ యాక్టివిటీ నేర్చుకున్నారని పేర్కొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు