Telangana: బావిలో పడ్డ కారు వెలికితీత.. రిటైర్డ్ ఎస్సై మృతి

కారును వెలికితీస్తున్న దృశ్యం

Telangana: కొద్దిసేపటి క్రితం కారును వెలికితీసి.. అందులో ఉన్న మృతి చెందిన వ్యక్తి రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్‌ అని గుర్తించారు.

  • Share this:
    ఎట్టకేలకు బావిలో పడ్డ కారును పోలీసులు వెలికితీశారు. ఇందుకోసం దాదాపు 8 గంటలకు పైగా శ్రమిచారు. కారులో ఉన్న వ్యక్తి రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్‌ మృతి చెందినట్లు గుర్తించారు. పాపయ్య నాయక్‌ హన్మకొండ భీమదేవరపల్లి వాసిగా ధృవీకరించారు.చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్‌లో ఈ ఉదయం కారు బావిలో పడింది. బావిలో నీరు నిండుగా ఉండటం.. బావి లోతుగా ఉండటంతో కారు లోతులోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కారును తీసేందుకు స్థానికులు, గజ ఈతగాళ్లు ఎంతగానో ప్రయత్నించారు. మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా.. పట్టువదలకుండా ప్రయత్నించారు. చివరకు కొద్దిసేపటి క్రితం కారును వెలికితీసి.. అందులో ఉన్న మృతి చెందిన వ్యక్తి రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్‌ అని గుర్తించారు. అయితే కారులో ఇంకెవరైనా ఉన్నారా ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కరీంనగర్ నుంచి పాపయ్య నాయక్ తన స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

    అంతకుముందు ఈ కారును పైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతగానో ప్రయత్నించారు. కారుకు ఐరన్ తాడును కట్టి క్రేన్‌తో పైకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. కారు కొంత దూరం వరకు పైకి వచ్చి మళ్లీ నీటిలో పడిపోయింది. ఒకదశలో కారును బయటకు తీసేందుకు సింగరేణి నుంచి నిపుణులను రప్పించాలని భావించారు. అయితే గజ ఇతగాళ్లు తీవ్రంగా శ్రమించి కారును వెలికితీశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: