Home /News /telangana /

RESIDENCIAL SCHOOL GIRL STUDENT COMMITS SUICIDE VRY

Khammam : ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి గర్భం.. తల్లిదండ్రులు మందలించడంతో..

గర్భం దాల్చిన స్కూల్ గర్ల్

గర్భం దాల్చిన స్కూల్ గర్ల్

Khammam : వికారాబాద్ జిల్లాలో ఓ మైనర్ బాలిక హత్యాచారం కేసు ముగియక ముందే మరో మరో మైనర్ బాలిక ప్రాణాలు విడిచింది. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక గర్భం దాల్చడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

    ప్రేమ పేరుతో యువతులే కాదు మైనర్ బాలికలు సైతం బలవుతున్నారు. చదువుకుంటున్న దశలోనే
    ప్రేమ చిగురించి లైంగిక వాంచలవైపు విద్యార్థిని,విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. దీంతో అనుకోని
    సంఘటనలు జరిగి ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. స్కూళ్లో పదవ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చంది.. అయితే ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో ఏం చేయాలో తోచని ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది.

    కాగా రెండు రోజుల క్రితమే వికారాబాద్ జిల్లా పూడురు మండలం అంగడిచిట్టిలో పదవతరగతి
    చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో మోస పోయింది. ప్రేమిస్తున్నానంటూ ఓ బాలిక వెంట పడిన
    యువకుడి తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ప్లాన్ వేశాడు. దీంతో అర్థరాత్రి పూట ఇంటికి
    పిలుపించుకుని బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని బాలిక వ్యతిరేకించడంతో దాడి చేసి కింద పడేశాడు.. దీంతో సృహకోల్పోయిన ఆమెపై అత్యాచారం చేయడంతో ప్రాణాలు కొల్పోయింది.

    CM KCR : కాసేపట్లో.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో...కారణం ఇదే..

    కాగా గతంలో కూడా ఎజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు గర్భం దాల్చిన సంఘటనలు వెలుగు
    చూశాయి.. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకున్నా మళ్లి ఇలాంటీ సంఘటనలు
    పునరావృతం కావడం కలకలం రేపుతోంది. అయితే ఇలా అమ్మాయిలను ట్రాప్‌లో పడేసి తమ
    కామవాంఛలను తీసుకునేవారిని చట్టప్రకారం శిక్షించి భవిష్యత్‌లో మళ్లి జరగకుండా చర్యలు చేపట్టాలని
    స్థానికులు కోరుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Khammam, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు