హోమ్ /వార్తలు /తెలంగాణ /

Singareni : కార్మికుల కోసం కొనసాగుతున్న ప్రయత్నాలు.. మరో కొద్ది గంటలు ఆగాల్సిందేనా..?

Singareni : కార్మికుల కోసం కొనసాగుతున్న ప్రయత్నాలు.. మరో కొద్ది గంటలు ఆగాల్సిందేనా..?

Singareni : సింగరేణి గనిలో కార్మికులను రక్షించేందుకు 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి . ప్రమాదం జరిగి 30 గంటలు గడిచినా..ఇంకా ముగ్గురు కార్మికుల ఆచూకి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.

Singareni : సింగరేణి గనిలో కార్మికులను రక్షించేందుకు 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి . ప్రమాదం జరిగి 30 గంటలు గడిచినా..ఇంకా ముగ్గురు కార్మికుల ఆచూకి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.

Singareni : సింగరేణి గనిలో కార్మికులను రక్షించేందుకు 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి . ప్రమాదం జరిగి 30 గంటలు గడిచినా..ఇంకా ముగ్గురు కార్మికుల ఆచూకి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.

  ( కరీంనగర్ జిల్లా, న్యూస్ 18, తెలుగు కరస్పండేట్, శ్రీనివాస్. )

  సింగరేణి గనిలో కార్మికులను రక్షించేందుకు 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి . పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని అడ్రియా లాంగ్ వాల్ గనిలో పైకప్పు కూలి ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు గనిలో చిక్కుకుపోయిన విషయం విదితమే .అయితే ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 24 గంటల తర్వాత నరేశ్, మరియు బదలీ వర్కర్ రవిందర్‌లను రక్షించి బయటకు తీసుకువచ్చారు. గాయాల పాలైన నరేశ్ , రవీందర్లను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు . అయితే 30 గంటలు గడిచినా ఇంకా ముగ్గురు గనిలో చిక్కుకు పోవడం , వారి ఆచూకీ తెలియక పోవడంతో కార్మికులతోపాటు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు .

  కాగా గనిలో చిక్కుకున్న కార్మికుకులను రక్షించేందుకు మిషనరీతో కాకుండా మాన్యువల్‌గా ప్రయత్నిస్తున్నారు.. మిషన్లతో బొగ్గు శకలాలను తొలగిస్తే అందులో చిక్కుకున్న కార్మికులకు గాయాలవుతాయని ఇతర మార్గాల్లో శకలాలను తొలగిస్తున్నారు . గనిలో చిక్కుకున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసేందుకు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు వైద్య సిబ్బందిని సైతం గనిలోకి పంపించారు . మరికొన్ని గంటలు గడిస్తే తప్ప గనిలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు .కాగా గనిలో చిక్కుకున్న వారిలో సేఫ్టీ అధికారి జయరాజ్ , అండర్ మేనేజర్ చైతన్య తేజ్‌తోపాటు తోట శ్రీకాంత్ లు ఉన్నారు.

  Bad sister : ప్రియుడి కోసం, తమ్ముడిని చంపేందుకు సుపారీ ఇచ్చిన అక్క.. ఆరునెలలుగా దొరకని శవం.. !

  శబ్దం లేకుంటే మరింత మంది .. ?

  ప్రమాదం జరిగిన సమయంలో భారీగా శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు . ఇదే క్రమంలో పని స్థలాలను గమనించి పైకి వస్తున్న ఏరియా సేఫ్టీ అధికారి జయరాజ్ శబ్దాన్ని గుర్తించి అక్కడ పనిచేస్తున్న కార్మికులను అప్రమత్తం చేశారు . ఏఎస్ఓ హెచ్చరికతో నలుగురు యువకార్మికులు అక్కడి నుంచి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు . మేనేజర్ బ్రహ్మాజీ కూడా పరుగెత్తే క్రమంలో కిందపడి గాయపడ్డట్లు చెబుతున్నారు . శబ్దం లేకుండా సైడ్ ఫాల్ అయితే పది మందికి పైగా బొగ్గు పొరల కింద చిక్కుకునే వారు .


  కాపాడిన ఐరన్మెస్ ..

  ప్రమాద సమయంలో ఎఫ్బీఎల్ యంత్రం అక్కడే ఉండటం .. మెస్ ముందుగా ఒరగడం .. దానిపై బొగ్గు పడటంతో ప్రమాదంలో చిక్కుకున్న వారికి రక్షణగా మారింది . ఇలా ముగ్గురు కార్మికులు ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక సహాయక చర్యలను సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ తో పాటు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్‌లు పర్యవేక్షిస్తున్నారు .

  First published:

  Tags: Adilabad, Singareni

  ఉత్తమ కథలు