REPUBLIC DAY CELEBRATIONS IN TELANGANA CM KCR PARTICIPATES VRY
Republic day : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. పాల్గొన్న సీఎం, గవర్నర్,
రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం కేసీఆర్
Republic day : తెలంగాణ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పెరెడ్ గ్రౌండ్‌లోని సైనిక అమరవీరులకు నివాళులు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పెరెడ్ గ్రౌండ్‌లోని సైనిక అమరవీరులకు నివాళులు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై వేడుకలను నిర్వహించారు.మరోవైపు తాత్కలిక సచివాలయం బీఆర్కే భవన్ సీఎస్ సోమేష్ కుమార్ , డీజీపీ కార్యాలయంలో డీజిపి మహెందర్ రెడ్డి, తో పాటు జిల్లా కేంద్రాల్లో మంత్రులు కలెక్టర్లు పాల్గొన్నారు.
కాగా ఈ సంధర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... రాజ్యాంగ నిర్మాతలు అందించిన సమాఖ్య స్పూర్తిని కొనసాగించడానికి కంకణబద్దులమవుతామని సీఎం పిలుపునిచ్చారు. ఇందుకోసం అచంచచ విశ్వాసంతో ముందుకు సాగాలని పేర్కోన్నారు. ఈ సంధర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే పాలకులై తమ ప్రభుత్వాలను నిర్మించుకోవాలని సీఎం అన్నారు.
రాజ్‌భవన్ లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.. ఈ సంధర్భంగా ఆమె మూట్లాడూతూ.. కోత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతోందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా రెండు వందల కోట్ల వ్యాక్సిన్ పూర్తి చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఎదగటం సంతోషకరమన్నారు.
తెలంగాణ.. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని కొనియాడారు. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు ఈ సందర్భంగా గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది కొనియాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 8 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.