తొలిసారిగా గణతంత్ర వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబు...

ఈ నెల 26న ఆదివారం పబ్లిక్ గార్డెన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే గణతంత్ర వేడుకలను ప్రతీ సంవత్సరం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా ఈ సంవత్సరం పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర వేడుకలు నిర్వహించడం విశేషం.

news18-telugu
Updated: January 24, 2020, 10:54 PM IST
తొలిసారిగా గణతంత్ర వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబు...
తొలిసారిగా గణతంత్ర వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబు...
  • Share this:
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. శనివారం రాత్రి నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ప్రధాన వేదికతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుల సందర్భంగా త్రివిధ దళాలతో పాటు పోలీసు విభాగాలు నిర్వహించనున్న పెరేడ్‌కు సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయి. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డిలు పబ్లిక్ గార్డెన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లును వారు పరిశీలించారు.

ఈ నెల 26న ఆదివారం పబ్లిక్ గార్డెన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే గణతంత్ర వేడుకలను ప్రతీ సంవత్సరం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా ఈ సంవత్సరం పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర వేడుకలు నిర్వహించడం విశేషం.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు