కృష్ణా పైప్‌లైన్ మరమ్మతు ..గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా ఉండని ప్రాంతాలివే..

కృష్ణా ఫేజ్ - 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజీలను అరికట్టేందుకు, పనులు చేపడుతున్న నేపథ్యంలో మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో జనవరి 29వ తేదీ ఉదయం 06 గంటల నుంచి జనవరి 30 తేదీ ఉదయం 06 గంటల వరకు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: January 27, 2020, 12:17 PM IST
కృష్ణా పైప్‌లైన్ మరమ్మతు ..గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా ఉండని ప్రాంతాలివే..
(ప్రతీకాత్మకచిత్రం)
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా బంద్ కానుంది. ఈ మేరకు జలమండలి అధికారులు ప్రకటన జారీ చేశారు. కృష్ణా ఫేజ్ - 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజీలను అరికట్టేందుకు, పనులు చేపడుతున్న నేపథ్యంలో మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో జనవరి 29వ తేదీ ఉదయం 06 గంటల నుంచి జనవరి 30 తేదీ ఉదయం 06 గంటల వరకు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు తెలిపారు.

మంచినీటి సరఫరా ఉండని ప్రాంతాలివే...
మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, అల్వాల్, పీర్జాదీగూడ, వైశాలీనగర్, మీర్ పేట, జల్‌పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం, ఆళ్లబండ, భోజగుట్ట, ఆసీఫ్ నగర్, రెడ్ హిల్స్, షేక్ పేట, ప్రశాసన్ నగర్, సైనిక్ పురి, లాలాపేట, స్నేహపురి కాలనీ, కైలాసగిరి, బండ్లగూడ, ‌ఋద్వేల్, సులేమాన్ నగర్, హైదర్ గూడ, గోల్డెన్ హైట్స్, గంధం గూడ, సాహెబ్ నగర్, ఆటోనగర్, నార్సింగ్, బోడుప్పల్, చెంగిచర్ల, ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు