Lok Sabha Election 2019 : ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రేణుకాచౌదరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఇంతెత్తున లేచారు. ఈ వివాదాస్పద పోస్టులను పెడుతున్నది కాంగ్రెస్, టీడీపీ నేతలేనని ఆరోపించారు. పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మరీ మరీ కోరారు. ఎన్నికల హడావుడిలో ఉన్న అధికారులు... సడెన్‌గా రేణుకా చౌదరి కంప్లైంట్ ఇవ్వడంతో... మిగతా పనులను పక్కనపెట్టి... దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇప్పుడు పోలీసులూ, అధికారులూ అందరూ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల రేణుకా చౌదరి కంప్లైంట్‌పై శుక్రవారం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి :
నేడే పోలింగ్... 20 రాష్ట్రాల్లో తొలి దశ ఎన్నికలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవీ ప్రత్యేకతలు
రన్ రాజా రన్ : మనవడితో ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Telangana Lok Sabha Elections 2019, Telangana News