Huzurabad : నాడు వెలవెల.. నేడు కళ కళ.. ఒక్కసారిగా పెరిగిన ఇండ్లు , ఫంక్షన్‌హాల్ ధరలు..కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad : ఈటల రాజీనామా ఆయన నియోజకవర్గ ప్రజలకు కాసులు కురిపిస్తోంది..కరోనా నేపథ్యంలోనే కుదేలైన ఇండ్ల కిరాయలతోపాటు పెళ్లిలు లేక బోయిన ఫంక్షన్‌హాళ్లు రెండు పార్టీల నేతలతో కళకళాడుతున్నాయి.ముఖ్యంగా వాటి కిరాయలు కూడా డబుల్ అయ్యాయి.

  • Share this:
కరీంనగర్ జిల్లా.

న్యూస్18తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.
రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికలు చాలా కాస్లీగా మారనున్నాయి..ముఖ్యంగా హుజురాబాద్‌లో రెండు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా..అనే స్థాయిలో అంతర్గత యుద్దం కొనసాగుతోంది. దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు రెండు పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండేందుకు పలు జిల్లాల నేతలు, కార్యకర్తలు ఇప్పటి నుండే రెఢీ అవుతున్నారు. ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు తాజామాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం నియోజకవర్గంలోనే ఆయన సతీమణితో పాటు పర్యటిస్తున్నారు. దీంతో రాష్ట్ర అధికార పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓ వైపు ఇంటలీజెన్స్ నివేదికలు తెప్పించుకుంటూనే మరోవైపు చోటా మోటా నాయకులను సైతం రంగంలోకి దింపుతున్నారు.

పార్టీ అభ్యర్థిని కూడా ఇప్పటినుండే రంగంలోకి దింపేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇందుకోసం పలువురు నేతలు క్యూ కడుతున్నా..ఈటలను ఢీకొట్టె అభ్యర్థి కోసం జల్లెడ పడుతున్నారు..సో ఈ పరిణామాలతో హుజురాబాద్ రాజకీయంగా హీట్ ఎక్కింది..అందుకే ఇతర ప్రాంతాల నుండి కూడా నాయకులు వచ్చి ఇప్పటి నుండే అడ్డా పెడుతున్నారు. దీంతో ఖాలీ ఇళ్ల కోసం వెతుకుతున్నవారు ఎక్కువమంది అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇండ్ల కిరాయలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోవైపు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ఇప్పుటి నుండే ఫంక్షన్‌హాళ్లను బుక్‌ చేసుకుంటున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో కూడా విటిధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాములుగా త్రిబుల్ బెడ్‌రూం ఇండ్లకు 7500,నుండి 8500, ఉండేది అలాగే ఫంక్షన్ హాల్స్ కు రోజుకు పెద్దవి 40, వేలు చిన్నవి 20 వేల రూపాయలు ఉండేవి, కానీ ఉప ఎన్నికల నేపథ్యంలోత్రిబుల్ బెడ్‌రూం ఇళ్లకు 20000 అలాగే పెద్ద ఫంక్షన్ హాల్స్ కు 80 వేలు చిన్నవి 40 వేలు తీసుకుంటున్నట్లు యజమానులు తెలుపుతున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్ల యజమానులు ఖుషి ఉన్నామని చెబుతున్నారు..గత రెండు సంవత్సరాలు కరోనా దెబ్బకు కుదేలైన ఫంక్షన్ హాళ్లు రానున్న నాలుగు నెలలు పూర్తిగా నిండిపోనున్నాయనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాగా రానున్న ఎన్నికల్లో డబ్బు ఎరులై పారడం ఖాయంగా కనిపిస్తోంది. అభ్యర్థులు కోట్ల రుపాయలను కూడా పెట్టేందుకు వెనకడుగు వేయడం లేదు..దీంతో డిమాండ్‌ను బట్టి అక్కడి పరిస్థితులు మారనున్నాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో అనే పరస్థితి నెలకొంది.
Published by:yveerash yveerash
First published: