Variety Ganesh Photos | ప్రపంచవ్యాప్తంగా వినాయకచవితికి ప్రజలు రకరకాల డిజైన్లలో గణనాధుడిని తయారు చేస్తుంటారు. ఏ డిజైన్‌లో తయారు చేసినా గణేషుడే దర్శనమిస్తుంటాడు. విఘ్ననాయకుడికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. అందుకే ప్రతి ఏటా గణేష్ మండపాల నిర్వాహకులు రకరకాల డిజైన్లలో వినాయకుడి విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తుంటారు. తమ మండపంలో గణేష్ వెరైటీగా ఉన్నాడంటే, తమ మండపంలో వినాయకుడు సరికొత్తగా ఉన్నాడంటూ పొంగిపోతుంటారు. అయితే, రిలయన్స్ డిజిటల్ కూడా అలాంటి ఓ వెరైటీ వినాయకుడిని తయారు చేసింది. హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న రిలయన్స్ డిజిటల్ షోరూంలో వినాయకుడి రూపాన్ని మన కిచెన్‌లో ఉండే వస్తువులతో రూపొందించారు. మిక్సీలు, మిక్సీ జార్లు, ఇస్త్రీ పెట్టెలు, బ్లెండర్‌ను ఉపయోగించి వినాయకుడి రూపాన్ని తయారు చేశారు. ఆ తర్వాత వాటికే పూలదండలు వేశారు. పైన కండువా వేశారు. దీంతో ఆ రూపం అచ్చం వినాయకుడిలా మారింది. ఇక్కడ ఇంకో క్రియేటివ్ అంశం ఏంటంటే, వినాయకుడి వాహనం అయిన ఎలుకను చూపేందుకు సింబాలిక్‌గా కంప్యూటర్ మౌస్‌ను వినియోగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.