హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gajwel: ఎర్రకోటను చూడాలనుకుంటున్నారా? గజ్వేల్‌లోని ఈ స్కూల్‌కు వెళ్తే చాలు..!

Gajwel: ఎర్రకోటను చూడాలనుకుంటున్నారా? గజ్వేల్‌లోని ఈ స్కూల్‌కు వెళ్తే చాలు..!

స్కూల్‌పై ఎర్రకోట నమూనా

స్కూల్‌పై ఎర్రకోట నమూనా

చాలా మంది తాము చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్లను మరిచిపోతుంటారు. తమకు చదువు చెప్పిన టీచర్లు కూడా గుర్తుండరు. కానీ గజ్వేల్‌లో ఓ పూర్వ విద్యార్థి మాత్రం రూ.7 లక్షలు ఖర్చు చేసి.. స్కూల్ భవనాన్ని అందంగా మార్చాడు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(వీరన్న, న్యూస్ 18 ప్రతినిధి, మెదక్)

ఎర్రకోట (Redfort)ను చూడాలంటే దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి వెళ్లాలి. కానీ అక్కడదాకా వెళ్లాల్సిన అవసరం లేదు. గజ్వేల్‌కు వెళ్లి కూడా ఎర్రకోటను చూడవచ్చు. అచ్చం అదే నమూనాతో గజ్వేల్ (Gajwel) మండల పరిధిలోని పిడిచెడ్ ప్రభుత్వ పాఠశాల కనిపిస్తుంది. స్కూల్ బిల్డింగ్‌పై నిర్మించిన ఎర్ర కోట నమూనా చూపరులను ఆకట్టుకుంటోంది. ఆ పాఠశాల పూర్వ విద్యార్థి పంగ మల్లేషం.. పుట్టిన ఊరికి.. చదివిన స్కూల్‌కు ఏదైనా చేయాలనే సంకల్పంతో తమిళనాడు (Tamilnadu), కేరళ (Kerala) నుంచి కళాకారులను తీసుకువచ్చి ఆ పాఠశాల భవనంపై ఎర్ర కోట నమూనాను నిర్మించారు. దానితో పాటు సరస్వతీ మాత, గోడలపై పలు రకాల ఆకట్టుకునే చిత్రాలను వేయించారు.

చాలా మంది తాము చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్లను మరిచిపోతుంటారు. తమకు చదువు చెప్పిన టీచర్లు కూడా గుర్తుండరు. కానీ గజ్వేల్‌లో ఓ పూర్వ విద్యార్థి మాత్రం రూ.7 లక్షలు ఖర్చు చేసి.. స్కూల్ భవనాన్ని అందంగా మార్చాడు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండలం. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల పిడిచెడ్ గ్రామంలో చదువుకున్న పూర్వ విద్యార్థి మల్లేశం తన వినూత్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిద్దారు. తమిళనాడు నుండి ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎర్రకోట నమూనాను నిర్మించారు.

మల్లేశం ఈ స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువున్నారు. ఇక్కడ చదవడం వల్లే ఇప్పడు మంచి స్థానంలో ఉన్నాడు.అందుకు కృతజ్ఞతగా స్కూల్‌ రేఖలను మార్చేశారు. మల్లేశం ఎర్రకోట మాదరిగా ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం తమకెంతో గౌరవంగా ఉందని అక్కడ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు అంటున్నారు. పూర్వ విద్యార్థుడు మల్లేశం తన సొంత డబ్బులతోటే స్కూల్లో రకరకాలు బొమ్మలను చిత్రీకరించారని తెలిపారు. ఇవి ఎంతో బాగున్నాయని.. విద్యార్థులను బాగా ఆకర్షిస్తున్నాని వెల్లడించారు. అందరూ తాము చదువుకున్న స్కూల్ కోసం ఎంతో కొంత చేయాలని మలేశం కోరుతున్నారు. తమ స్కూల్‌ను, టీచర్లను జ్ఞాపకం చేసుకొని.. పాఠశాల సుందీకరణ, మౌలిక వసతులు కల్పించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

First published:

Tags: Gajwel, Telangana