Home /News /telangana /

RECORD NUMBER OF APPLICATIONS FOR OPEN INTER AND TENTH EXAMS AS NEVER BEFORE IN TELANGANA AMID CORONA SECOND WAVE HSN

Telangana: కరోనా సెకండ్ వేవ్ తో వేలాది మందిలో చిగురించిన ఆశలు.. విపత్తును అదృష్టంగా మార్చుకునేందుకు మాస్టర్ ప్లానేశారా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా లాంటి విపత్తులను కూడా అవకాశాలుగా మార్చుకోవాలనుకున్నారు. కరోనా కారణంగా ఎలాగైనా గండం గట్టెక్కాలనుకుంటున్నారు. వేలాది మంది కళ్లు కాయలు కాచేలా తమకు పట్టబోయే అదృష్టం గురించి ఎదురుచూస్తున్నారు.

  ‘ఆటంకాలను అవకాశాలుగా మార్చుకుని పైకి ఎదిగేవాడినే సమాజం గుర్తిస్తుంది. అలాంటి వాళ్లే హీరోలవుతారు. ఉన్నత శిఖరాలను అందుకుంటారు‘ ఇలాంటి డైలాగులే సినిమాల్లో హీరోల గురించి ఉంటుంటాయి. ఎన్ని కష్టాలు పడి అయినా సరే వాటిని ఎదుర్కొని గెలవాలన్నదే ఆ వ్యాఖ్యల ఉద్దేశం. ఆ సినిమా డైలాగుల ప్రభావం మనోళ్లపై బాగానే పనిచేసినట్టుంది. అందుకే కరోనా లాంటి విపత్తులను కూడా అవకాశాలుగా మార్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి వల్లయినా సరే ఎలాగైనా గండం గట్టెక్కాలనుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది మంది కళ్లు కాయలు కాచేలా తమకు పట్టబోయే అదృష్టం గురించి ఎదురుచూస్తున్నారు. ఏంటీ? ఇంతకీ అసలు కథేంటి? అనే కదా మీ డౌటు. అక్కడికే వెళ్దాం. అసలు కథేంటో తెలుసుకుందాం.

  రోజూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశం లేని వారికి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ వంటి చదువులను దూర విద్య ద్వారా చేసే సౌలభ్యం ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి యేటా వేలాది మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుంటారు. ఇలా పరీక్షలు రాసే వాళ్లల్లో పాస్ పర్సెంటేజీ చాలా తక్కువగానే ఉంటుంది. ఒకటి రెండు సబ్జెక్టులు పాస్ అవుతూ, పోయిన వాటిని మళ్లీ రాస్తూ ఎట్టకేలకు గండం గట్టెక్కుతుంటారు. ఇలా పాస్ అయిన వారిని కూడా రెగ్యులర్ విద్యార్థులతో పాటు సమానంగా ఉద్యోగావకాశాల్లో పరిగణిస్తుంటుంటారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా టెన్త్, ఇంటర్ చదివేందుకు వెసులుబాటు ఉంది.
  ఇది కూడా చదవండి: ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటుకు నిజంగా ఇంత డిమాండ్ ఉందా..? రూ.11 లక్షలు ఇస్తామని ఫోన్.. చివరకు..

  ప్రతీ యేటా ఈ ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 50 వేల నుంచి 60 వేల మంది వరకు దరఖాస్తు చేస్తుంటారు. గతేడాది 61,294 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంటర్మీడియట్ కు 28517 మంది, టెన్త్ కు 32,777 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరితోపాటు మరో 17వేల మంది వరకు బ్యాక్ లాగ్ విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేని స్థితి ఉండటంతో రికార్డు స్థాయిలో మొత్తం 78వేల మందిని మినిమం మార్కులతో ప్రభుత్వం పాస్ చేయించింది.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

  తాజాగా అదే సీన్ రిపీట్ అవుతుందని వేలాది మంది ఆశించారనుకుంటా. కరోనాను ఓ అవకాశంగా తీసుకుంటే ఎలాగైనా పరీక్షల్లో పాస్ అవొచ్చని భావించారేమో. ఈ ఏడాది కూడా ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలకు కనీవినీ ఎరుగని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఈ పరీక్షలకు 89,454 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 50,502 మంది టెన్త్ కు, 38,952 మంది ఇంటర్మీడియట్ కు దరఖాస్తు చేసుకున్నారు. మే 10వ తారీఖు వరకు ఈ పరీక్షలకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో గతంలో సబ్జెక్టులు మిగిలిపోయిన వాళ్లు మరింత మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి కూడా పరీక్షలు రద్దు చేసి, అందరినీ పాస్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? వీళ్ల ఆశలు నెరవేరతాయో లేదో?తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: CM KCR, Corona, Exams, Ssc exams, Telangana, Telangana inter board

  తదుపరి వార్తలు