Home /News /telangana /

REASON BEHIND THE NEWLY MARRIED WIFE MURDER CASE IN KHAMMAM DISTRICT REVEALED BY HUSBAND FULL DETAILS HERE HSN

నవ వధువు హత్య కేసులో బయటపడిన అసలు ట్విస్ట్.. అందుకే చంపేశానంటూ నిజం చెప్పేసిన భర్త

మృతురాలు నవ్య రెడ్డి

మృతురాలు నవ్య రెడ్డి

సీసీ కెమెరాల్లో రికార్డయిన ఓ వీడియో ఆధారంగా భర్తను అదుపులోకి తీసుకుంటే అతడు అసలు నిజం ఒప్పుకున్నాడు. భార్యను తానే హత్య చేశానని నిజం చెప్పాడు. అందుకు గల కారణమేంటో కూడా పోలీసుల విచారణలో అతడు వెల్లడించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    ఖమ్మం జిల్లాలో కలకలం సృష్టించిన నవవధువు హత్య కేసు కొలిక్కి వస్తోంది. పెళ్లయిన రెండు నెలలకే భర్త తన భార్యను ఎందుకు చంపాడన్నది ఎట్టకేలకు బయటికొచ్చింది. పోలీసుల విచారణలో ఆ భర్తే అసలు నిజం చెప్పేశాడు. మొదట తన భార్య కనిపించకుండా పోయిందనీ, కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని భర్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే విచారణ మొదలు పెట్టిన పోలీసులకు అడుగడుగునా భర్త తీరుపై అనుమానాలు కలిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఓ వీడియో ఆధారంగా భర్తను అదుపులోకి తీసుకుంటే అతడు అసలు నిజం ఒప్పుకున్నాడు. భార్యను తానే హత్య చేశానని నిజం చెప్పాడు. అందుకు గల కారణమేంటో కూడా పోలీసుల విచారణలో అతడు వెల్లడించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెనికి చెందిన నాగ శేషు రెడ్డికి తమ సమీప నవ్య రెడ్డితో రెండు నెలల క్రిందట పెళ్లయింది. నాగ శేషు రెడ్డి పూణెలో ఉద్యోగం చేస్తుంటాడు. నవ్యకు అతడు స్వయానా మేన మామ కొడుకు. నవ్య సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామ శివార్లలోని కుక్కల గుట్ట వద్ద నవ్య రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భర్త నాగ శేషు రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన పోలీస్ లు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

    పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా నాగ శేషు రెడ్డి ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. బుదవారం రాత్రి సమయం లో నవ్య రెడ్డి ని బైక్ పై తీసుకు వచ్చి కుక్కల గుట్ట వద్ద మత్తు టాబ్లెట్ లు ఇచ్చి అనంతరం చున్ని తో ఉరి వేసి హత్య వేశాడు. ఆ తరువాత హత్య ను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ ఫోన్ నుండి ఆమె తండ్రికి మెసేజ్ చేశాడు. బీటెక్ లో సబ్జెక్టులు మిగిలి ఉండటంతో మనస్తాపంతో చనిపోతున్నానంటూ ఆమె తండ్రికి ఆమె ఫోన్ నుంచే మెసేజ్ చేశాడు. పోలీసుల విచారణలో తానే హత్య చేశానని నాగశేషు రెడ్డి నిజం ఒప్పుకోవడంతో మిస్సింగ్ కేసును కాస్తా, హత్య కేసుగా మార్చి పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

    నాగశేషురెడ్డికి 20 ఏళ్ల వయసున్న ఓ యువతితో ఏడాది నుంచి వివాహేతర సంబంధం నడుస్తోంది. ఆమె కూడా బీటెక్ రెండో ఏడాది చదువుతోంది. ఆమెతో అక్రమ సంబంధం ఉన్నా నాగశేషురెడ్డి తన మరదలిని రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం గురించి నవ్యారెడ్డికి తెలిసింది. నిలదీసింది. అక్రమ సంబంధానికి కటీఫ్ చెప్పడం నాగశేషురెడ్డికి ఇష్టం లేకుండా పోయింది. భార్యను అడ్డు తొలగించుకుంటే తన ప్రేయసితో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్లి సంతోషంగా జీవించవచ్చునని ప్లాన్ వేశాడు.అన్నుకున్నట్టుగానే భార్యను చంపాడు. కానీ విచారణలో అడ్డంగా దొరికిపోయాడు. అయితే నవ్యారెడ్డి మృతదేహం లభ్యమైన రోజే అతడి ప్రేయసి కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

    నాగశేషురెడ్డికి ప్రేమ వ్యవహారం ఉందని తెలిసి, నవ్యారెడ్డి మృతదేహం లభ్యమైన రోజే ఆమె ఇంటికి వెళ్లి పలు ప్రశ్నలు అడిగారు. విచారణలో భాగంగానే నాగశేషురెడ్డి ప్రేయసి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అవసరం అయితే మరోసారి విచారణకు వస్తామనీ, అందుబాటులో ఉండాలని కోరి, వెళ్లిపోయారు. ఇది జరిగిన కొద్ది సేపటికే పెగళ్లపాడు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆమె ఆత్మహత్య చేసుకుంది. మొత్తానికి కట్టుకున్న భార్యను చంపేసిన నాగశేషురెడ్డికి, ప్రేయసి కూడా దక్కకుండా పోయింది.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Khammam, Wife kill husband

    తదుపరి వార్తలు