• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • REASON BEHIND REVANTH REDDY SUDDEN PADAYATRA FROM ATCHAMPETA OF TELANGANA AK

Revanth Reddy: రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

Revanth Reddy: రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

రేవంత్ రెడ్డి(ఫైల్ పోటో)

Revanth Reddy: కొద్దిరోజుల క్రితం టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి ఖాయమైనట్టు ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఈ పదవి మరో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఖాయమైందని కొందరు చర్చించుకుంటున్నారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. అచ్చంపేట నుంచి ఉన్నట్టుండి పాదయాత్ర చేయాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి పాదయాత్ర చేయడం వెనుక అసలు కారణం ఏంటనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని ఆయన భావిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతుండేవారు. అయితే ఇంత హఠాత్తుగా ఆయన పాదయాత్ర చేపట్టడం వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతోంది.

    తాను కోరుకుంటున్న టీపీసీసీ చీఫ్ పదవి కోసమే ఆయన పాదయాత్ర చేపట్టారని టాక్ వినిపిస్తోంది. నిజానికి కొద్దిరోజుల క్రితం టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి ఖాయమైనట్టు ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఈ పదవి మరో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఖాయమైందని కొందరు చర్చించుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. జానారెడ్డి ద్వారా వ్యూహాత్మకంగా ఇందుకు సంబంధించి ప్రకటన రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం కూడా సాగింది.

    అయితే మరోసారి టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలయ్యేలోపు తాను పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజల మద్దతు కూడగట్టాలని రేవంత్ రెడ్డి భావించారని.. ఈ కారణంగానే ఆయన పాదయాత్ర చేపట్టారని కొందరు చర్చించుకుంటున్నారు. తనకు ఎంతో పట్టున్న అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజల్లో తన పట్ల ఉన్న సానుకూలతలను చూపించాలని ఆయన వ్యూహరచన చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    అంతేకాదు.. ఇతర నేతలు పాదయాత్ర చేపట్టే వరకు వేచి చూడకుండా ఈ విషయంలో తాను ముందు వెళ్లాలని రేవంత్ రెడ్డి భావించారని.. అందుకే పాదయాత్ర విషయంలో హఠాత్తుగా ముందుకు సాగిపోయారనే టాక్ కూడా కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మొత్తానికి పాదయాత్ర ద్వారా తెలంగాణ రాజకీయాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో తన ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: