Home /News /telangana /

REASON BEHIND MIM MLA AKBARUDDIN OWAISI COMMENTS ON PV NARASIMHA RAO AND NT RAMA RAO AK

PV Narasimha Rao Akbaruddin Owaisi: పీవీ నరసింహారావుపై ఎంఐఎంకు ఎందుకంత కోపం.. కారణం అదే

అక్బరుద్దీన్ ఓవైసీ, పీవీ నరసింహారావు(ఫైల్ ఫోటో)

అక్బరుద్దీన్ ఓవైసీ, పీవీ నరసింహారావు(ఫైల్ ఫోటో)

PV Narasimha Rao Akbaruddin Owaisi: పీవీ నరసింహారావు విషయంలో ఎంఐఎం వ్యతిరేక వైఖరికి అసలు కారణంగా బాబ్రీ మసీదు విధ్వంసం ఘటన అనే వాదన ఉంది.

    భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి తొలగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించగా... అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ కూడా ఖండించింది. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను తొలగించాలని అక్బరుద్దీన్ ఏ సందర్భంలో అన్నారనే విషయం పక్కనపెడితే.. పీవీ నరసింహారావు విషయంలో ఎంఐఎం మొదటి నుంచి వ్యతిరేక భావంతోనే ఉందనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

    అయితే పీవీ నరసింహారావు విషయంలో ఎంఐఎం వ్యతిరేక వైఖరికి అసలు కారణంగా బాబ్రీ మసీదు విధ్వంసం ఘటన అని వాదన ఉంది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నా... ఆయన ఈ ఘటనను అడ్డుకోలేకపోయారనే భావన ఎంఐఎంలో ఉంది. పీవీ నరసింహారావు కఠినంగా వ్యవహరించి ఉంటే.. అప్పట్లో బాబ్రీ మసీదు విధ్వంసం ఘటన జరిగేది కాదన్నది ఎంఐఎం అభిప్రాయం. అందుకే పీవీ నరసింహారావు విషయంలో ఎంఐఎం ఎప్పుడూ వ్యతిరేక వైఖరితోనే ఉంటుందని పలువురు చెబుతుంటారు.

    ఇక ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ విషయంలో ఎంఐఎంకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ.. ఆయన పట్ల మజ్లిస్‌ సానుకూలం కూడా కాదనే వాదన ఉంది. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తరువాత పలు సందర్భాల్లో కమ్యూనిస్టులు, బీజేపీతో కలిసి ముందుకు నడిచారు. అప్పట్లో ఎంఐఎం కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగింది. టీడీపీ, ఎంఐఎం మధ్య రాజకీయ వైరం పెద్దగా లేకపోయినప్పటికీ.. ఎన్టీఆర్‌ను, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీతో మజ్లిస్ ఎప్పుడూ కలిసి పని చేయలేదు. ఈ కారణంగానే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను హుస్సేన్ సాగర్ ఒడ్డు నుంచి తొలగించాలని వ్యాఖ్యానించినట్టు చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Akbaruddin owaisi, GHMC Elections, Pv narasimha rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు