కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన గోలి శ్రీకాంత్ ( 23 ) పై కరీంనగర్ లోని కట్టరాంపూర్‌కు చెందిన బండారి మారుతి తల్వార్‌తో దాడిచేశాడు ... బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు .
బాధితుడి బంధువుల వివరాల ప్రకారం .. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన గోలి శ్రీకాంత్ వద్ద కట్టరాంపూర్‌కు చెందిన మానకొండూర్ మండలం చెంజర్ల విద్యుత్తు లైన్‌మెన్ బండారి మారుతి ( 40 ) మూడేళ్ల క్రితం రూ .20 లక్షలు తీసుకున్నాడు . అప్పటి నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడు. డబ్బులు అడిగినప్పుడల్లా..డబ్బులకు బదులుగా భూమి ఇస్తానని చెప్పి దాటవేస్తూ వచ్చాడు . దీంతో శ్రీకాంత్ డబ్బుల కోసం ఇటివల ఒత్తిడి చేయడంతో మారుతి తట్టుకోలేక పోయాడు. ఎలాగైన శ్రీకాంత్‌ను బెదిరించి డబ్బులను ఎగ్గొట్టాలనే ప్లాన్ వేశాడు.
దీంతో భూమిని కొలతలు వేసి ఇస్తానని శ్రీకాంత్‌ను తన ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. ప్లాన్ ప్రకారం ముందుగా మద్యం సేవించారు. అనంతరం భూమి కొలతల కోసం టేపును పట్టుకోమని చెప్పాడు..టేపును పట్టుకునేందుకు శ్రీకాంత్ కిందకి వంగడంతో ఒక్కసారిగా ఆతనిపై కత్తితో దాడి చేశాడు. దాడి నేపథ్యంలోనే తీవ్రంగా ప్రతిఘటించాడు. అయినా మారుతి విచక్షణ రహితంగా దాడి చేయడంతో శ్రీకాంత్ సృహ తప్పిపడిపోయాడు.
దాడి అనంతరం శ్రీకాంత్ చనిపోయాడనుకుని మారుతి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీకాంత్ తన బంధువయిన కిరణ్ కు పోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన కిరణ్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..అనంతరం తన స్నేహితులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. కత్తితో దాడిచేయడంతో ఒళ్లంతా గాయాలపాలైన శ్రీకాంత్ ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది.
కాగా స్థానిక పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శ్రీకాంత్‌ను కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ..గతంలో కూడా భూ వివాదంలో ఒకరిని హత్య చేసిన కేసు కూడా ఉన్నట్టు పోలీసులు వివరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Karimnagar, Murder attempt