హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kidnap Video: నిర్మల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం.. ఎలా కిడ్నాప్ చేశారో వీడియో చూడండి..

Kidnap Video: నిర్మల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం.. ఎలా కిడ్నాప్ చేశారో వీడియో చూడండి..

కిడ్నాప్ చేస్తున్న దుండగులు

కిడ్నాప్ చేస్తున్న దుండగులు

Kidnap Video: నిర్మల్ జిల్లాలోని దివ్యానగర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. రియల్టర్ విజయ్‌చందర్ దేశ్‌పాండేను గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై విజయ్ చందర్ కుటుంబ సభ్యులు దగ్గర్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ముఠా సభ్యులు ఇంట్లోకి వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలివే..

ఇంకా చదవండి ...

(కట్టా లెనిన్, ఆదిలాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ రియల్టర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో ఉన్న తన్వి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న విజయ్ దేశ్ పాండేను ఈ రోజు ఉదయం 7.30 సమయంలో సంగారెడ్డి కి చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయనను బలవంతంగా లాక్కొని అపహరించారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. సత్వరమే రంగంలోకి దిగిన నిర్మల్ పట్టణ పోలీసులు అప్రమత్తమై వారిని వెంబడించారు.

ఇది గమనించిన కిడ్నాపర్లు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా వెళ్లడంతో, పట్టణ పోలీసులు ఇందల్వాయి, మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాపర్ల ను వెంబడించి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక కారును, తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద మరో కారులోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంటలోనే కిడ్నాప్ కేసును చేదించిన నిర్మల్ పట్టణ పోలీసులను, ఇందల్వాయి, మేడ్చల్ పోలీసులను నిర్మల్ డిఎస్పి ఉపేంద్రా రెడ్డి అభినందించారు.


రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలే కిడ్నాప్ కు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డిలో విజయ్ దేశ్ పాండే రెండు కోట్ల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు తెలిసింది. సంగారెడ్డి కి చెందిన కృష్ణారావు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రా రెడ్డి తెలిపారు. పోలీసులు బాధితుడిని , నిందితులను తీసుకుని నిర్మల్ కు వస్తున్నారు.

First published:

Tags: Adilabad, Crime, Kidnap, Telangana crime news

ఉత్తమ కథలు