మీ నగరాన్ని ఎంచుకోండి

    హోమ్ /వార్తలు /తెలంగాణ /

    Ktr : డ్రగ్స్‌పై నేను ఏ టెస్టుకైనా సిద్దం.. రాహుల్ గాంధీ శాంపిల్స్ ఇస్తాడా.. ?

    Ktr : డ్రగ్స్‌పై నేను ఏ టెస్టుకైనా సిద్దం.. రాహుల్ గాంధీ శాంపిల్స్ ఇస్తాడా.. ?

    కేటీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

    కేటీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

    Ktr : గత కొద్ది రోజులుగా చెలరేగుతున్న డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు డ్రగ్స్‌తో ఎలాంటీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎలాంటీ టెస్టుకైనా తాను సిద్దమని మంత్రి కేటీఆర్ అన్నారు.

    సైదాబాద్‌లోని (saidabad)సింగరేణి కాలనీ ఆరెళ్ల చిన్నారీపై అత్యాచారం, హత్య తర్వాత నగరంలో డ్రగ్స్, (drugs)గంజాయి సరాఫరాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే మత్తు పదార్థాల రవాణాతో పాటు గంజాయి విచ్చల విడిగా సరాఫరా అవుతుందని దానికి ప్రభుత్వ ఉదాసీనత కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.

    ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ను(ktr) టార్గెట్ చేస్తూ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ప్రభుత్వం సహకరించక పోవడానికి ప్రధాన కారణం .. మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆయన ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. అందుకే డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న కేంద్ర సంస్థలకు(ED) రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

     ఇది చదవండి : నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.. ఆ రూట్లలో సాధారణ ట్రాఫిక్ నిషేధం


    ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. మంత్రి కేటీఆర్ స్పందించారు. డ్రగ్స్ మాఫియాకు తనకు ఎలాంటీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం తాను ఎలాంటీ టెస్టుకైనా(test) సిద్దమని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు ఇలాంటీ టెస్టుల కోసం కాంగ్రేస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandi) సిద్దమా అంటూ రాజకీయంగా సవాల్ విసిరారు.

    ఇది చదవండి : రేపే.. గణేష్ నిమజ్జనం అంతా సిధ్దం .. 320 కి.మీ.ల పొడవునా గణేశ్ శోభాయాత్ర


    ముఖ్యంగా ఈడికి తనపై ఎవరో లేఖ ఇస్తే తనకు ఏంటీ సంబంధం అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక ఈడీకి తనపై లేఖ ఇచ్చిన వాడు ఒక బఫూన్ అంటూ పరోక్షంగా కాంగ్రేస్ పార్టీని విమర్శించారు. ఈనేపథ్యంలోనే ఆయన ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు.

    ఇది చదవండి : ఆడుకుంటున్న కొడుకును ఇంట్లోకి తీసుకువెళ్లిన తండ్రి... కత్తితో గొంతు కోసి దారుణం ..!


    మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌజ్‌లో ఉంటే అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆటంకం కల్గుతుందా..? అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు రావడం ఆగిపోతున్నాయా లేక అభివృద్ది ఆగిపోతుందా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక మీదట సీఎం కేసీఆర్‌పై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

    ఇక గత కొద్ది రోజులుగా కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే మరోవైపు కేటీఆర్ సైతం రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పై చేసిన వ్యాఖ్యలను ఏకంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో సంచలనంగా మారింది. దీంతో ఏకంగా రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా మరో సవాల్‌ను మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డికి విసిరి ఏకంగా రాహుల్ గాందీని ఈ విషయంలో ఇరుకున పెట్టారు. దీంతో డ్రగ్స్ కేసు రాష్ట్రం దాటి దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినట్టయింది.

    First published:

    Tags: Drugs case, Hyderabad, KTR, Revanth Reddy

    ఉత్తమ కథలు