మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం.. ఆర్డీవో,తహసీల్దార్లకు 2 నెలల జైలు శిక్ష..

Mallanna Sagar : న్యాయస్థానం ఆదేశించినా తమకు న్యాయం జరగలేదని మల్లన్నసాగర్ నిర్వాసితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది.

news18-telugu
Updated: August 20, 2019, 12:24 PM IST
మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం.. ఆర్డీవో,తహసీల్దార్లకు 2 నెలల జైలు శిక్ష..
తెలంగాణ హైకోర్టు
  • Share this:
మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సిద్దిపేట జిల్లా తోగుట్ట ఆర్డీవో విజేందర్ రెడ్డి, తహశీల్దార్‌ ప్రభులకు హైకోర్టు శిక్ష విధించింది. ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష విధించింది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశించినా.. న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకపోవడంతో వీరికి శిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశించినా తమకు న్యాయం జరగలేదని మల్లన్నసాగర్ నిర్వాసితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి యుద్దప్రాతిపదికన వారికి పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్ గతంలో అధికారులను ఆదేశించినా.. ఇంకా పరిహారం అందని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>