హోమ్ /వార్తలు /తెలంగాణ /

మక్కా మసీదుకు వెళ్లి వివాదంలో చిక్కుకున్న తెలుగు యూట్యూబర్.. ముస్లిం సంఘాల ఆగ్రహం

మక్కా మసీదుకు వెళ్లి వివాదంలో చిక్కుకున్న తెలుగు యూట్యూబర్.. ముస్లిం సంఘాల ఆగ్రహం

రవి తెలుగు ట్రావెలర్

రవి తెలుగు ట్రావెలర్

యూట్యూబ్‌లో తాను చేసుకున్న క్లైయిమ్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న ఇప్ప‌టి వ‌ర‌కు రవి సమాధానం చెప్పలేదు. ఇదే అంశంపై ర‌విని న్యూస్ 18 సంప్ర‌దించిన‌ప్పుడు క‌నీస మీడియా అనే గౌరవం కూడా ఇవ్వకుండా.. దీనిపై స్పందించే మూడ్‌లో లేన‌ని చెప్ప‌డం విశేషం.

ఇంకా చదవండి ...

(బాలకృష్ణ, న్యూస్ 18 ప్రతినిధి)

యూట్యూబ్ (Youtube) అనేది ప్ర‌స్తుతం యువ‌త‌కు ఒక మంచి అవ‌కాశంగా మారింది. త‌మ‌లో ఉన్న ప్ర‌తిభ‌ను ప్రపంచానికి చూపించ‌డానికి చక్కటి వేదికగా ఉపయోగపడుతోంది. డ‌బ్బుకు డ‌బ్బు.. గుర్తింపుకు గుర్తింపు వ‌స్తుండ‌డంతో చాలా మంది.. యూట్యూబ్‌లో ఛాన‌ల్ పెట్టి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ యూట్యూబ్ ఛానెల్స్ నడుపుతున్నారు.  ఐతే కొందరు మాత్రం  కాంట్రవర్సీ  చేస్తున్నారు.   తాజాగా తెలుగు ట్రావెల్ క‌మ్యూనిటీలో జ‌రుగుతున్న ర‌చ్చ ఇందుకు ఉదాహర‌ణ‌. ట్రావెలింగ్ ఛాన‌ల్ పేరుతో పలువురు అడ్డ‌గోలు వ‌సూళ్లు చేస్తుంటే.. మరికొందరు వ్యూస్ కోసం వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ తెలుగు యూట్యూబర్ మక్కా మసీదు (Mecca Mosque)లోకి వెళ్లి వివాదంలో చిక్కుకున్నాడు.


రవి తెలుగు ట్రావెలర్ (Ravi Telugu Traveler).. యూట్యూబ్‌లో ట్రావెలింగ్ వీడియోలు చూసే వారికి ఈయన సుపరిచితమైన వ్యక్తి. ఏపీలో విశాఖపట్టణానికి చెందిన ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. దేశ విదేశాలు తిరుగుతుంటాడు. వాటిని వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పటి వరకు 186 దేశాలు తిరిగానని.. మరే తెలుగు వ్యక్తి కూడా ఇన్ని దేశాల్లో పర్యటించలేదని రవి చెబుతుంటాడు. ఐతే అవన్నీ ప్రగల్భాలని.. రవి అన్ని దేశాలు తిరగలేదని తోటి యూట్యూబర్‌లు ఆరోపిస్తున్నారు. ఐతే రవి గతంలో ఓసారి మక్కా పర్యటనకు వెళ్లాడు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీదులో కొన్ని కఠినమైన నిబంధనలు ఉంటాయి.  అక్కడి చట్టాల ప్రకారం ముస్లిమేతర వ్యక్తులు మక్కాకు రావడం నిషిద్ధం. ఇటీవల ఓ ఇజ్రాయెల్ జర్నలిస్ట్ అక్కడ పర్యటించడం వివాదాస్పదమైంది.  ఆయనపై చట్టపరమైన చర్యలు మొదలు పెట్టారు.


రవి కూడా మక్కా మసీదుకు వెళ్లి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. తాను హిందువుని అయినప్పటికీ.. మక్కాలో వెళ్లగలిగానని.. ఇలాంటి ఫీట్ ఇంకెవరూ చేయలేరని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ గొప్పలే ఇప్పుడు ఆయన్ను వివాదంలోకి నెట్టాయి. హిందువు అయి ఉండి మక్కా పర్యటించడం సౌదీ చట్టాలకు విరుద్ధమని.. ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. అతడు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా మ‌క్కా మ‌సీదులోకి ప్రవేశించిన విషయం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని హైద‌రాబాద్ ముస్లీమ్ సోసైటీ సౌత్ ఇండియా నేత‌లు న్యూస్ 18కి తెలిపారు. ముస్లింల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే విధంగా ఆయన ప్రవర్తించారని.. యూట్యూబ్ వేదికగా బహిరంగ చెప్పాల‌ని వారు డిమాండ్ చేశారు. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


రవి యూట్యూబ్ వీడియోలపై ముందు నుంచీ విమర్శలున్నాయి. 186 దేశాలు తిరిగిన తొలి తెలుగు వాడిని తానేనని.. గతంలో ప్రెస్ మీట్ పెట్టి క్లైమ్ చేసుకున్నాడు రవి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దిగిన ఫొటోలను షేర్ చేసి.. తనకు ఉన్నతాధికారులతో కూడా సత్సంబంధాలు ఉన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. ఐతే రవి.. ఒక ఫేక్ ట్రావెలర్ అని తోటి యూట్యూబర్స్ ఆరోపిస్తున్నారు. అసలు ఆయన భారతీయుడే కాదని.. అమెరికా పౌరసత్వంతోనే అన్ని దేశాలు తిరుగుతున్నాడని మండిపడుతున్నారు. ఆయన 186 దేశాలు తిరగలేదని.. వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ కోసమే అబద్ధాలు చెబుతూ.. పాపులారిటీ తెచ్చుకున్నాడని విమర్శిస్తున్నారు. రవి 186 దేశాలు తిరిగాడ‌ని నిరూపిస్తే ఒక కోటీ 40 ల‌క్ష‌లు ఇస్తానని అన్వేష్ అనే యూట్యూబర్ ప్రకటించాడు. కానీ దీనిపై ఇప్పటి వరకు రవి స్పందించలేదు.

గతంలో పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా రవి కామెంట్స్ చేశాడు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు జ‌రుగుతున్న‌ప్పుడు పాకిస్తాన్‌కు స‌పోర్ట్ చేస్తూ త‌న వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్‌లు పెట్టడం, పాకిస్తాన్ జిందాబాద్ అనే హ్యాష్ ట్యాగ్స్‌ను వాడ‌డంపైనా ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటిని తొలగించాలని వ్యూయర్స్ కోరితే.. ఎందుకు డిలీట్ చేయాలంటూ అహంకారం ప్రదర్శించాడు. అంతేకాదు ఆయన గతంలో ఓసారి పాకిస్తాన్‌లో పర్యటించాడు. ఇప్పుడు రెండోసారి కూడా పాకిస్తాన్‌లో ట్రావెలింగ్ వీడియోలు చేస్తున్నారు. ఒక భారతీయుడిగా.. అది కూడా భారత సరిహద్దు వాఘా నుంచి పాకిస్తాన్‌లోకి వెళ్లాలని.. ఇలా వెళ్లగలిగే సత్తా మరెవరికీ లేదన్నట్లుగా రవి చెప్పుకున్నాడు. కానీ వాస్తవానికి అతడు భారత పాస్‌పోర్టుతో పాకిస్తాన్‌లోకి వెళ్లలేదని.. అమెరికా పాస్‌పోర్టుతోనే పాకిస్తాన్‌లో తిరగగలుగుతున్నాడని తోటి యూట్యూబర్స్ ఆరోపిస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం భారతీయుడినని.. అందులోనూ తెలుగోడినని అసత్య ప్రచారం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. డబ్బుల కోసం దేశం పరువు తీస్తున్నాడని మండిపడుతున్నారు.


యూట్యూబ్‌లో తాను చేసుకున్న క్లైయిమ్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న ఇప్ప‌టి వ‌ర‌కు రవి సమాధానం చెప్పలేదు. ఇదే అంశంపై ర‌విని న్యూస్ 18 సంప్ర‌దించిన‌ప్పుడు క‌నీస మీడియా అనే గౌరవం కూడా ఇవ్వకుండా.. దీనిపై స్పందించే మూడ్‌లో లేన‌ని చెప్ప‌డం విశేషం. యూట్యూబ్ ఛానెల్ పేరుతో ఈయన వ్యవహరిస్తున్న తీరుపై యూట్యూబ్ కమ్యూనిటీ కూడా మండిపడుతోంది.

First published:

Tags: Travelling, Youtube

ఉత్తమ కథలు