• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • RATNAGIRI PALLI HAS BEEN NOMINATED FOR A NATIONAL AWARD UNDER THE EMPLOYMENT GUARANTEE SCHEME IN KAMAREDDY VB NZB

తాగడానికి నీరు లేదు.. ఉండటానికి సరిగా ఇళ్లు లేవు.. అయినా ఆ గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికయింది.. ఎందుకో తెలుసా..

రత్నగిరిపల్లి గ్రామం

ఎక్కడో మారుమూల పల్లెటూరు. ఆ గ్రామంలో మౌలిక వసతులు లేక ఇంటికి ఒక్కరు చొప్పున గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారు. ఇంటి దగ్గర ఉండేవాళ్లు ఏదో కూలీనాలీ చేసుకొని బతికేవారు. ఇలాంటి సమయంలో వారికి ఉపాధి హామీ పథకం వరంగా మారింది. జాతీయస్థాయి అవార్డు కోసం ఈ గ్రామం ముందు వ‌ర‌స‌లో నిలిచింది.

  • Share this:
    ( పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

    ఎక్కడో మారుమూల పల్లెటూరు. ఆ గ్రామంలో మౌలిక వసతులు లేక ఇంటికి ఒక్కరు చొప్పున గల్ఫ్ దేశాలను వలస వెళ్లేవారు. ఇంటి దగ్గర ఉండేవాళ్లు ఏదో కూలీనాలీ చేసుకొని బతికేవారు. ఇలాంటి సమయంలో వారికి ఉపాధి హామీ పథకం వరంగా మారింది. ఏదో పని చేసామా అని కాకుండా చెమటోడ్చి నాలుగు డబ్బులు సంపాదించడంతో పాటు వారు చేసిన‌ పనిని నలుగురు మెచ్చేలా చేశారు. దీంతో మారుమూల గ్రామమైన అధికారుల దృష్టిని ఆకర్షించించారు. జాతీయస్థాయి అవార్డు కోసం ఈ గ్రామం ముందు వ‌ర‌స‌లో నిలిచింది. తెలంగాణ‌ రాష్ట్రం నుంచి ఆరు గ్రామాల‌ను ఎంపిక చేశారు. ఆ ఆరు గ్రామాల్లో రత్నగిరి పల్లి ఒకటి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలో ఉన్న రత్నగిరి పల్లి గ్రామం.. ఈ గ్రామం కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల స‌రిహ‌ద్దులోని మారుముల ప‌ల్లే.. ఇక్క‌డ‌ ఎలాంటి సాగునీటి సౌకర్యాలు లేవు బోరుబావుల మీద ఆధారపడి పంటలు పండిస్తారు.

    భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి వేసిన‌ పంటలు నీరు లేక‌ ఎండిపోయి రైత‌న్న‌లు న‌ష్ట‌పోవడం మాములే.. దీంతో ఉన్న ఊరిలో ఉపాధి లేక ఇంటికి ఒక‌రు గల్ఫ్ దేశం వలస వెళ్లారు. గ్రామ‌స్తులంతా క‌లిసి క‌ట్టుగా స‌మావేశమై గ్రామాభివృద్ది, ఉపాధిపై దృష్టి పెట్టారు. జాతీయ‌ ఉపాధి హామీ పై గ్రామ‌స్తులు అంద‌రికి అవగాహన కల్పించారు.  దీంతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా అందరు ఉపాధి పనులకు అలవాటు అయ్యారు. గ్రామంలో మొత్తం 472 కుటుంబాలకు జాబ్ కార్డులు ఇచ్చారు. అయితే 442 కుటుంబాలు ఉపాధి పనులకు హాజరవుతున్నాయి. ఈ ఏడాది 273 కుటుంబాలు 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నారు. 897 మంది ఉపాధి పనులకు వెళ్లి కోటి నాలుగు లక్షలు రూపాయ‌లు ఉపాధి హామి ప‌థ‌కం నుంచి పొందారు.

    ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన గ్రామస్తులు


    ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన గ్రామస్తులు


    ఈ యేడు రెండు కోట్ల రూపాయ‌లు ల‌క్ష్యంగా పెట్టుకోగా.. గ్రామం నుంచి ప్రతిరోజు కూలీలు సుమారు 5 నుంచి 10 మీటర్ల దూరం వరకు ట్రాక్ట‌ర్, ఆటో, బైక్ కుల‌పై వెళ్లి ఉపాధి పనులు చేయడం విశేషం.. అటవీ ప్రాంతంలో కందకాలు, ఊట చెరువులు తవ్వడం వంటి పనులు చేస్తున్నారు.. ఉపాధి నిధులతో ఊరంతా సిసి రోడ్లు వేసుకున్నారు.. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రత్నగిరిప‌ల్లి గ్రామంలో పక్కగా అమలు చేసారు. అన్ని గ్రామాల్లో ఒకటే ప్ర‌కృతి వ‌నం ఎర్పాటు చేస్తే రత్నగిరిలో మాత్రం నాలుగు చోట్లా ఏర్పాటు చేశారు. పాఠశాలలో ప్రాజెక్టు ద్వారా పాఠాలు చెబుతున్నారు..

    గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించారు. గ్రామంలో ఉపాధి హామీ నిదుల‌తో పంచాయతీ భవనం తో పాటు మహిళా సంఘ భవనం నిర్మించుకున్నారు.  గ్రామంలో స‌రైన ఉపాధి లేక‌ అందరూ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు.. ఉపాధి హామీ పథకంలో ఉన్న ఊరిలో ఉపాధి ల‌బించాడంతో పరిస్థితి మారింది.. ప్రణాళికతో పనులు చేయడం వలన కూలీ గిట్టుబాటు అవుతోంది.. పల్లె ప్రగతి ద్వారా గ్రామ స్వరూపం మారిపోయింది.. అధికారులు, విప్ గంప గొవ‌ర్ధ‌న్ స‌హ‌కారంతో మా గ్రామం అభిద్ది చెందిండ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.. మ‌రో వైపు జాతీయ అవార్డు ర‌త్న‌గిరిప‌ల్లి ఎంపిక అయినందుకు సంతోషంగా ఉంద‌న్నారు.
    Published by:Veera Babu
    First published: