RATION CARD NEW RULES WILL COME INTO EFFECT IN HYDERABAD AND RANGAREDDY DISTRICTS FROM TODAY NOW OTP AUTHENTICATION IS MANDATORY TO GET RATION SS
Ration Card: రేషన్ తీసుకుంటున్నారా? నేటి నుంచి కొత్త రూల్స్... తెలుసుకోండి
Ration Card: రేషన్ తీసుకుంటున్నారా? నేటి నుంచి కొత్త రూల్స్... తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
Ration Card | మీకు రేషన్ కార్డు ఉందా? ప్రతీ నెల రేషన్ తీసుకుంటున్నారా? ఫిబ్రవరిలో రేషన్ షాప్‌కి వెళ్లే ముందు కొత్త రూల్స్ తెలుసుకోండి. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి.
నేటి నుంచి రేషన్ తీసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాల్సిందే. తెలంగాణలోని మొదటిసారిగా ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ తీసుకోవాలంటే రేషన్ కార్డు హోల్డర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తేనే సరుకులు తీసుకోవడం సాధ్యమవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఐరిస్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఇక పనిచేయదు. తెలంగాణలోని మొత్తం 87,44,251 రేషన్ కార్డు హోల్డర్స్ ఉండగా వారిలో 5,80,680 కార్డులు హైదరాబాద్‌లో, 5,24,656 కార్డులు రంగారెడ్డి జిల్లాలో, 4,94,881 కార్డులు మేడ్చల్ మల్కార్జిరి జిల్లాలో, 2,34,940 కార్డులు వికారాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఈ రేషన్ కార్డ్ హోల్డర్లు అంతా ఇకపై తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పి రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలి. కాబట్టి రేషన్ కార్డులు ఉన్నవారంతా తమ మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. మరి ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సరుకులతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్నపూర్ణ, అంత్యోదయ స్కీమ్‌ల ద్వారా ఇచ్చే సరుకుల్ని రేషన్ కార్డులపై పొందొచ్చు. ఈ పథకాలే కాదు మరిన్ని ప్రభుత్వ స్కీమ్‌ల ద్వారా లబ్ధి పొందడానికి రేషన్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్. కరోనా వైరస్ మహమ్మారి లాక్డౌన్ సమయంలో పేదలకు సరుకులు అందజేసేందుకు రేషన్ షాపుల పాత్ర కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంటే రేషన్ కార్డు హోల్డర్లు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఎవరైనా రేషన్ కార్డుకు అప్లై చేయొచ్చు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ప్రత్యేక పథకాలు ఉన్నాయి. బిలో పావర్టీ లైన్-BPL, నాన్ బీపీఎల్ పేరుతో రెండు రకాలుగా రేషన్ కార్డులు ఉంటాయి. 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా రేషన్ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు. ఒక రాష్ట్రంలో మాత్రమే రేషన్ కార్డుకు అప్లై చేయాలి. రేషన్ కార్డులో యజమాని పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి.
తెలంగాణలో రేషన్ కార్డుకు అప్లై చేయాలంటే మీసేవ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ సభ్యుల వివరాలతో ఫామ్ పూర్తి చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి మీసేవ సెంటర్లో దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి. రెసిడెన్స్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.