హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : తెలంగాణ గడ్డపై మరో అరుదైన పంట.. 14 ఏళ్ల రైతు శ్రమకు ఫలితం...

Karimnagar : తెలంగాణ గడ్డపై మరో అరుదైన పంట.. 14 ఏళ్ల రైతు శ్రమకు ఫలితం...

కరీంనగర్ జిల్లాలో రుద్రాక్ష చెట్ల పెంపకం..

కరీంనగర్ జిల్లాలో రుద్రాక్ష చెట్ల పెంపకం..

కరీంనగర్ జిల్లాలో రుద్రాక్ష చెట్ల పెంపకం..

  ఆధునిక వ్యవసాయంలో అనేక మార్పులు వస్తున్నాయి. అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా.. భూమి స్వభావం, వాతవరణ మార్పులను భట్టి పంటల ఉత్పత్తి, దాని పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన పంటలకు అవకాశాలు మాత్రమే ఉంటాయి.అయితే ఈ వాతవరణ మార్పులు, నేలల స్వాభావంతో సంబంధం లేకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే ఎలాంటీ పంటలైనా పండించవచ్చనే దీమాను తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు నిరూపించారు. ఎక్కడో శీతల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే రుద్రాక్ష సాగును చేసి మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచారు.

  రుద్రాక్ష చెట్లు అంటేనే పరమేశ్వరుని రూపం అందుకే రుద్రాక్షను హిందు భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయితే రుద్రాక్ష చెట్లు ఎదుగుదలకు శీతల ప్రదేశం అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా థాయిలాండ్ నేపాల్ తో పాటు, భారతదేశంలో హిమాలయ పర్వతాలలో రుద్రాక్ష వృక్షాలు విస్తారంగా కనిపిస్తాయి.ఇంతలా ఉన్న వృక్షాలు మరెక్కడ కనిపించవు. అయితే ఈ రుద్రక్ష చెట్లు కరీంనగర్ గడ్డ పై ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా ,గంగాధర మండలం, నేలకొండపల్లికి చెందిన ఆకుల లక్ష్మయ్య అనే రైతు సాహసోపేతంగా చేసిన రుద్రాక్ష సాగు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయి. తన మిత్రుడి సలహాతో 14 ఏళ్ల క్రితం రుద్రాక్ష ముక్కలను తీసుకొచ్చి రైతు లక్ష్మయ్య సాగు చేశాడు.. నిపుణుల సూచనలను తీసుకుంటూ,ఎంతో భక్తిశ్రద్ధలను కన పరుస్తూ రుద్రాక్ష చెట్లను పెంచుతున్నాడు. దీంతో.. రుద్రాక్ష మొక్కలు పెరిగి విరివిగా కాయలు కాస్తున్నాయి.

  Bhdrachalam : పేరు గొప్ప, మరి ఊరు.... భద్రాచలంపై కొత్త పంచాయితీ... హైకోర్టులో వాదనలు..!

  రుద్రాక్ష చెట్లు రైతు లక్ష్మయ్య కు అధిక దిగుబడిని ఇస్తున్నాయి. కాగా ఈ చెట్లను చూస్తే.. నేరేడు చెట్ల మాదిరిగా 30 అడుగుల ఎత్తు పెరిగి..  చూపరులను సైతం కనువిందు చేస్తున్నాయి. రుద్రాక్ష చెట్టు పెరిగితే చాలు అనుకున్న రైతు 14 ఏళ్ల తరువాత దిగుబడి రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి...


  Hyderabad : ఫెయిల్ అయ్యావా.. అయితే నకిలీ సర్టిఫికెట్ కొనుక్కొ.. ప్రోత్సహిస్తున్న పేరెంట్స్..!

  ఈ సందర్భంగా రైతు లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ చెట్లను హైదరాబాద్ గ్రోమోర్ వారు ఇచ్చారని కానీ ఇవి ఇక్కడ పెరగవని అప్పుడే చెప్పారు. అయినా ఇవి దొరకడమే అదృష్టంగా భావించి తీసుకొచ్చి ఇక్కడ నాటమని చెప్పారు. కాగా ఇక్కడ పెరిగిన రుద్రాక్ష, అసలు ఎలా ఉంటుంది.. ఏ రంగులో ఉంటాయో.. తెలుసుకోవడానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారని ఆయన తెలిపారు.. ప్రభుత్వం సహకరిస్తే ఈ రుద్రాక్ష తోటలను ఇంకా పెంచి అధిక దిగుబడి సాధిస్తానని రైతు లక్ష్మయ్య అంటున్నారు.

  First published:

  Tags: Agriculture, Karimnagar, Telangana

  ఉత్తమ కథలు