Home /News /telangana /

RARE ANIMAL FOUND IN SATHUPALLI NS

Save Animal: ఖమ్మం జిల్లాలో కనిపించిన అరుదైన జంతువు.. దాని పేరు ఏంటంటే..

మూషిక జింక

మూషిక జింక

Save Animal: ఖమ్మం జిల్లాలో ఓ అరుదైన జంతువు కనిపించింది. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు టిప్పర్ డ్రైవర్లు ఓ వింత జంతువును గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దానిని అరుదైన మూషిక జింకగా గుర్తించారు.

ఇంకా చదవండి ...
శ్రీనివాస్ రెడ్డి, న్యూస్ 18 ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ఓ అరుదైన జంతువు కనిపించింది. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు టిప్పర్ డ్రైవర్లు ఓ జంతువును గుర్తించారు. ఆ జంతువు వింతగా కనిపించడంతో ఆ టిప్పర్ డ్రైవర్లు, స్థానికులు దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు దానిని అరుదైన మూషిక జింక గా గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ జంతువును మూషిక జింకగా నిర్ధారించామన్నారు.

అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో ఈ ముషిక జింక ఒకటన్నారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జంతువు సంచరిస్తుందని వివరించారు. జేవీఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలోని కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో ఈ మూషిక జింక లభ్యం కావడం విశేషమన్నారు. ప్రస్తుతం లభ్యమైన మూషిక జింక వయస్సు ముడు నెలలు ఉంటుందన్నారు. రేంజర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఆ జింక పిల్లను అటవీ శాఖ సిబ్బంది కిన్నెరసాని వణ్యప్రాణి అభయారణ్యానికి తరలించారు.

Sathupalli, Sathupalli Open cost, Rare Animal. kinnerasani Project, kinnerasani Forest, Khammam forest, కిన్నెరసాని అభయారణ్యం, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్, అరుదైన జంతువు, మూషిక జింక
అధికారులకు మూషిక జింకను అప్పగిస్తున్న స్థానికులు


గతంలోనూ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కారణంగా అనేక జంతువులు అడవుల నుండి జనావాసాల్లోకి వచ్చాయి. ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకుని జూ పార్కుకు, అడవులకు తరలించిన ఘటనలు ఉన్నాయి. ఏదైనా జంతులువులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Animal Lovers, Forest, Khammam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు