మైనర్ బాలికపై అత్యాచార యత్నం...నోట్లో గుడ్డలు కుక్కి...

ఎవరో కొత్త వ్యక్తి ఇంట్లోకి రావడం, అతని కదలికలు అనుమానస్పదంగా ఉండడం, బాలిక గట్టిగా అరవడాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.

news18-telugu
Updated: August 13, 2019, 3:08 PM IST
మైనర్ బాలికపై అత్యాచార యత్నం...నోట్లో గుడ్డలు కుక్కి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. మైలార్‌దేవిపల్లిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ కామంధుడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి పైశాచికంగా ప్రవర్తించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...బాల్‌రాజ్ అనే వ్యక్తి తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబంతో కలివిడిగా ఉండేవాడు. ఆ ఇంట్లో ఉండే 12 ఏళ్ల బాలికతో తరచూ మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఐతే ఇటీవలే ఆ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి..వేరొక ఇంట్లోకి వెళ్లిపోయారు. అప్పటికే బాలికపై కన్నేసిన బాల్‌రాజ్ దీన్ని జీర్ణించులేకపోయాడు.

ఈ క్రమంలో సోమవారం బాలిక నివాసం ఉండే ఇంట్లోకి చొరబడి అత్యాచార యత్నం చేశాడు. ఎవరో కొత్త వ్యక్తి ఇంట్లోకి రావడం, అతని కదలికలు అనుమానస్పదంగా ఉండడం, బాలిక గట్టిగా అరవడాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని బాల్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయాన్ని వెల్లడించారు. వారి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: August 13, 2019, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading