హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news: ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు జలసమాధి ..ఎలా జరిగిందంటే..?

Sad news: ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు జలసమాధి ..ఎలా జరిగిందంటే..?

Three children died

Three children died

Sad news:రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్‌ మండలంలోని షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల సోలిపూర్ శివారులోలోని ఓ వెంచర్ నీటిగుంటలో ముగ్గురు చిన్నారులు పడి దుర్మరణం పాలయ్యారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Rangareddy, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  రంగారెడ్డి జిల్లాలో విషాదం..

  నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

  షాద్‌నగర్ నియోజకవర్గం సోలిపూర్ లో ఘటన..

  ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు

  విషాద సంఘటన..

  రంగారెడ్డి(Rangareddy)జిల్లాలో విషాదం నెలకొంది. షాద్‌నగర్(Shadnagar)నియోజకవర్గం ఫరూక్‌నగర్‌(Farooqnagar)మండలంలోని షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల సోలిపూర్(Solipur) శివారులోలోని ఓ వెంచర్ నీటి గుంత(Water hole)లో ముగ్గురు చిన్నారులు పడి దుర్మరణం(Three children died)పాలయ్యారు. చనిపోయిన ముగ్గురు చిన్నారుల వయసు పదేళ్లలోపే ఉండటంతో ఈసంఘటన స్థానికంగా అందర్ని కలచి వేసింది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు నీటి కుంట దగ్గరకు చేరుకున్నారు. నీళ్లలో చేపలను పట్టాలనే సరదాతో నీటిలోకి దిగారు. దురదృష్టవశాత్తు ఆ ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. నీటి గుంట లోతుగా ఉండటం, చిన్నారులు ముగ్గురూ ఒకే వయసు వాళ్లు కావడంతో తమను తాము రక్షించుకోలేక.. నీటిలో మునిగి చనిపోయి ఉంటారని సోలిపూర్ గ్రామస్తులు తెలిపారు.

  విలవిల్లాడిన చిన్నారుల ప్రాణాలు..

  స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు నీటి కుంట దగ్గరకు చేరుకున్నారు. ఆడుకుంటున్న పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి బోరున విలపించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజుల్లో ముగ్గురు పసివాళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Ranga reddy, Telangana News

  ఉత్తమ కథలు