Telangana: నేను వేసే బొమ్మల్లో ఎక్కువగా ప్రకృతిని పల్లె వాతావరణన్ని చూపుతాను ప్రస్తుత కాలంలో ప్రకృతికి జనం దూరం అవుతున్నారు అందుకే గ్రామీణ వాతావరణం అక్కడి చేతివృత్తులను పచ్చదనానికి నా ప్రాధాన్యత
కుంచెనునోటితో పట్టుకొని రెప్ప వేయకుండా రంగులు దిద్దుతున్న ఈమె పేరు శ్రీలేఖ నోటితో పెయింటింగ్ ఈ రికార్డులు నెలకొల్పాలని ప్రయత్నిస్తూ కాబోలు అనుకుంటే పొరపాటు పద్ధతి పుట్టుక తోనే కాళ్లు చేతులు పనిచేయకపోయినా తనలో ఉన్న సృజనను నోటితో అందంగా ఆవిష్కరించి చూపుతున్నారు. శ్రీలేఖ జీవితం అంటే ఏదో లేదన్న వెలుతుతో కాలం గడపడం కాదు ఎంతో ఉందని తెలుసుకోవడం నలుగురికి తెలియజెప్పడం అంటున్న శ్రీలేఖతో కాసేపు మాట్లాడితే మన జీవితాన్ని అర్ధవంతంగా ఇలా మలుచుకోవాలో అవగతమవుతుంది.
సృష్టిలోని అందాలను నోటితోనే కాన్వాస్పై ఆవిష్కరిస్తున్న అద్భుతాలు గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్ చందానగర్ లో నివాసం ఉంటున్న ఆమె ఇంటికి వెళ్ళాలి 30 ఏళ్ల క్రితం విజయనగరం ఏపీఎస్ఆర్టీసీలో శ్రీలేఖ తండ్రి సోమన్న గౌడ్ రీజినల్ ఆఫీసర్గా పని చేసేవాడు. తల్లి సునంద గృహిణి, అన్న శ్రీకాంత్, అక్క శ్రీలక్ష్మి తరువాత తల్లిదండ్రులకు మూడో సంతానంగా 1982లో శ్రీ లేక పుట్టింది. ముద్దుగా ఉన్న పాపను చూసి ఇంటిల్లపాది సంతోషించారు.
కానీ పుట్టిన బిడ్డలోకదలికలు లేకపోవడంతో కంగారు పడ్డారు. వైద్యులు పరీక్షలు జరిపి అమ్మాయికి కండరాల క్షీణత ఆర్తో గ్రిఫోసిస్ కంటినిటల్ జబ్బు ఉంది. ఈ జబ్బు పుట్టుకతోనే వస్తుంది. శరీరం పెరుగుదల కండరాలలో పట్టు ఉండదు. కీళ్లు పనిచేయవు. ఇలాంటి జబ్బులు ఉన్నాపిల్లల్లోమొదలు ఎదుగుదల ఉండదు. కానీ అదృష్టవశాత్తు మీ అమ్మాయికి మెదడు పని చేస్తుంది అన్నారు. స్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
కాళ్లు అంగుళం కదలవు చేతులు ఏ పనికి సహకరించవు నోటితో కుంచబట్టి రంగుల చిత్రాలను ఆవిష్కరించింది. ముందుకు వెళ్తున్న హైదరాబాద్ అమ్మాయి శ్రీలేఖ పూర్తివంతమైన ప్రస్థానం. నేను వేసే బొమ్మల్లో ఎక్కువగా ప్రకృతిని పల్లె వాతావరణన్ని చూపుతానని అంటున్నారు.ప్రస్తుత కాలంలో ప్రకృతికి జనం దూరం అవుతున్నారు అందుకే గ్రామీణ వాతావరణం అక్కడి చేతివృత్తులను పచ్చదనానికి నా ప్రాధాన్యతను ఇస్తానంటున్నారు.
నోటితో అన్ని రకాల స్ట్రోక్స్ ఇవ్వడం అసాధ్యమని పెయింటిగ్లో రాణించలేనని క్లాస్ తీసుకోలేనని చెప్పారు. మాస్టర్ ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నాను. సార్ చెప్పినట్టు పెయింటింగ్ వేసి చూపించాను. ఇప్పుడు మాస్టర్ నీ దగ్గరే నేను పాటలు నేర్చుకునేలా పెయింటింగ్ వేస్తున్నావు అని మెచ్చుకున్నారు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపిస్తూ...తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే శ్రీలేఖ పలు అవార్డులను కైవసం చేసుకున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.