(Syed Rafi, News18,Mahabubnagar)
తల్లిలేని పిల్లల్ని తండ్రులు గారాబంగా పెంచుతారు. ఆడపిల్లలను మరింత అల్లారు ముద్దుగా సాకుతారు. కాని ఓ పదహారేళ్ల అమ్మాయి.. తన తండ్రి చాలా దుర్మార్గుడని, అతను పెట్టే టార్చర్(Torture) భరించలేక చచ్చిపోతున్నానని సూసైడ్ లెటర్ (Suicide letter)రాసి మరీ ప్రాణాలు తీసుకోవడం రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. సరిగ్గా సంవత్సరం క్రితం తల్లి చనిపోయింది. ఈ ఏడాదిలోనే ఆ అమ్మాయికి తండ్రి బ్రతికుండగానే నరకం చూపించాడని లేఖలో పేర్కొంది. తండ్రి పెట్టే బాధలు చెప్పుకోలేకే ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి(Rangareddy)జిల్లా హైదరాబాద్ (Hyderabad)పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికుల్ని కలచివేసింది.
మా డాడీ వెరి బ్యాడ్..
రంగరెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని నందిగామ మండలం బుగ్గొనిగుడ గ్రామానికి మనీషా చేగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో పదో తరగతి చదువుతోంది. సోదరుడు శ్రవణ్ సమీపంలోని కాన్హా శాంతి వనంలో ఎలక్ట్రికల్ స్టోర్ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. టెన్త్ ఎగ్జామ్స్ కారణంగా సోదరుడి ఇంట్లో ఉంది మనీష. అయితే ఇంట్లో తండ్రి నర్సింహులు మద్యం తాగొచ్చి కూతుర్ని వేధించడం, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇంట్లో తండ్రి పెట్టే టార్చర్ భరించలేకపోయిన మనీషా ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసి తన చావుకు కారణం తండ్రేనని మా డాడీ వెరీ బ్యాడ్ అంటూ పేర్కొంది. అతడ్ని నాన్న అని పిలవాలంటేనే అసహ్యం వేస్తోందని సూసైడ్ లెటర్‌లో రాసింది మనీష. టెన్త్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న విషయాన్ని మనీష సోదరుడు శ్రవణ్ ద్వారా తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంపాలనిపించింది..
16సంవత్సరాల మనీషకు ఏడాది క్రితమే తల్లి లలిత చనిపోయింది. లలిత కూడా ఆమె భర్త నర్సింహులు పెట్టే టార్చర్ భరించలేకే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మనీష సూసైడ్ చేసుకున్న ప్రదేశంలో ఓ నోట్‌బుక్‌లో మనీష తన తండ్రి మంచివాడు కాదని..అతడి చేష్టలను చూస్తే చంపాలనిపిస్తోందని లేదంటే చావాలని ఉందంటూ రాసింది. ఐ హేట్ మై డాడ్ అని నాలుగుసార్లు రాసింది. ఐ యాం వెయింటింగ్ ఫర్ డెత్ అని రాసున్న నోట్‌బుక్ ఆధారంగా తండ్రి నర్సింహుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నర్సింహులు మద్యం మత్తులో కన్నకూతురి పట్ల ఏవిధంగా చిత్రహింసలకు గురి చేశాడు..అతని మానసిక పరిస్థితి ఏంటి అనే కోణంలో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rangareddy, Student suicide