Ravinder, News18, Rangareddy
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ఎస్ఆర్డీపీ అని కేటీఆర్ అన్నారు. విశ్వనగరంగా ఎదిగేందుకు ఎస్ఆర్డీపీని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీ కింద ఆరు సంవత్సరాలలో 33 అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. హైదరాబాద్ లో ఉన్న మౌళిక వసతులు దేశంలో ఎక్కడా లేవని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయని ఆయన అన్నారు. ప్రస్తుతం నగరం నలువైపులా విస్తరిస్తోంది.
మొదటి ఫేజ్ లో 8 వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రెండో
ఫేజ్ 2 లో మరో 3500 కోట్లు అభివృద్ధి కీ ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ పేర్కొన్నారు.
అనేక లింక్ రోడ్లు వేశాం..
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్దంగా ముందుకు పోతున్నామని కేటీఆర్ అన్నారు.
ఎంఎంటీఎస్ విస్తరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించారని తెలిపారు.
మెట్రో రెండో దశలో భాగంగా 63 కిలోమీటర్లు విస్తరిస్తామన్నారు.
ఈ రోజు ఓఆర్ఆర్ వద్ద 2.8 కిలోమీటర్ల ప్లైఓవర్ ను ప్రారంభించారు
హైదరాబాద్ లో సెకండ్ లార్జెంస్ట్ ప్లైఓవర్..
ఈ ప్రాంతంలో రానున్న రెండు నెలల్లో మరో మూడు ప్లైఓవర్ లు అందుబాటులో కి తెస్తాం..
రోడ్లు, మంచినీరు, శాంతిభద్రతలు అందించామని, త్వరలో భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Telangana