హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rangareddy: భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఎలా చేసారంటే?

Rangareddy: భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఎలా చేసారంటే?

X
వ్యభిచార

వ్యభిచార ముఠా గుట్టురట్టు

Rangareddy: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల తో పాటు విదేశీ మహిళల తో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Ravinder,News 18, Rangareddy.

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ కేసు గురించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ సెక్స్ రాకెట్ ముఠాలో 17 మందిని అరెస్ట్ చేశాం. 15 సిటీల నుండి అమ్మాయిలను రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. వెబ్ సైట్, వాట్సప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లును ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. 39 కేసుల్లో ఈ నిందితుల ప్రమేయం ఉన్నట్లు తేలింది.

ఈ ముఠాలో మొత్తం 1419 మంది అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించగా.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో ఈ సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. సెక్స్ రాకెట్స్ తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లుకు ఎర వేస్తున్నారు. సైబరాబాద్ లో ఐదు కేసులు నమోదు చేసి విచారిస్తున్నాం. సప్లేయర్స్, బ్రోకర్ల ద్వారా భాదితులను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారు. విమానాల్లో కూడా అమ్మాయిలను వేరే రాష్ట్రాలకి కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారు.

ఏపీ, తెలంగాణా, కర్ణాటక , ఢిల్లీ, ముంబై, కోల్ కత్తాకి చెందిన వారు భాదితులు ఉన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, యూజీకిస్తాన్, రష్యాకి చెందిన అమ్మాయిలతో కూడా ఈ దందా చేస్తున్నారు. వ్యభిచారం ద్వారా వచ్చిన అమౌంట్ లో 30% అమ్మాయిలకు, 35% యాడ్స్, వెబ్ సైట్ కి వెళుతుంది 35% ఆర్గనైజర్లుకి వెళుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడు కాగా.. 915 మంది అమ్మాయిలని ముంబై, కోల్ కత్తా నుండి సప్లై చేశాడు. 2019 నుండి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. అనంతపూర్, కరీంనగర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ లో ఆర్నావ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, వ్యభిచార దందా చేస్తున్నాడు.

ఆర్నావ్ 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు. సోమజిగూడలో ఆర్నావ్ ను ఓ ఫ్లాట్ లో పట్టుకున్నాం, అదే ఇంట్లోనే MDMA డ్రగ్స్ ను సీజ్ చేశాం. ఈ సెక్స్ రాకెట్ వివిధ గ్రూప్ లుగా విడిపోయి ఈ దందా చేస్తున్నారు. కొన్ని హోటల్స్ కి పని చేసే వాళ్ళు కూడా ప్రమేయం ఉంది.. వారిని కూడా అరెస్ట్ చేశాం. వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న వారికి అమ్మాయిలని సప్లై చేస్తున్నారు.

జాబ్ లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. MDMA డ్రగ్స్ ను అమ్మాయిలకు, కస్టమర్లుకు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. చాలా మంది అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు. మరి కొంత మందిని అయితే లగ్జరీ లైఫ్ చూపించి ఈ వ్యభిచారం లోకి దింపుతున్నారు. ఒక్కొక్కరు 40 లక్షలు సంపాదించినట్లు తెలిసింది.

First published:

Tags: Local News, Rangareddy, Telangana

ఉత్తమ కథలు