(Syed Rafi, News18,Mahabubnagar)
చెడు తిరుగుళ్లు, చెడు సావాసం, వ్యభిచార నేపథ్యం ఇవన్నీ కలిసి ఓ మహిళ హత్యకు కారణం అయ్యాయి. వ్యభిచార నేపథ్యంలో తన కంటే బాగుంటుంది ఆమె దగ్గరకే ఎక్కువ మంది కస్టమర్లు వెళుతున్నారని అసూయతో ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. రంగారెడ్డి(Ranga Reddy)జిల్లా షాద్ నగర్(Shad Nagar)నియోజకవర్గం కొందుర్గు పోలీస్ స్టేషన్ (Police station)పరిధిలో గత నెల 23వ తేదీన గుర్తుతెలియని మహిళా శవాన్ని గోనే సంచిలో రోడ్డు పక్కన పడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం మహిళదిగా గుర్తించిన పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టగా 11రోజుల్లో మిస్టరీని చేధించారు. నిందితులను పట్టుకున్నారు. హత్య చేయడానికి కారణాలు తెలిసి షాక్ అయ్యారు.
ఆడదానికి ఆడదే శత్రువు..
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన పెంటల అమృత 37సంవత్సరాల నడివయసు కలిగిన మహిళతో పాటు కమ్మదనంలో నివాసం ఉంటున్న గుణుగుర్తి సరిత అనే 40సంవత్సరాల మహిళ ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ వ్యభిచార వృత్తినే కొనసాగిస్తుండగా మరింత దగ్గరయ్యారు. షాద్ నగర్ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు స్థానికంగా వీరు వ్యభిచార వృత్తిని కొనసాగిస్తూ ఎంతో మందితో పరిచయాలు ఏర్పరుచుకున్నారు. అయితే అమృత కన్నా సరిత బాగుందని ఆమెకే కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారని డబ్బులు ఎక్కువ సంపాదిస్తుందనే అక్కస్సుతో అమృత సరితపై ద్వేషం పెంచుకుంది.
వ్యభిచార వృత్తిలో పోటీ వస్తోందని ..
తన కంటే ఎక్కువ డబ్బు సంపాధిస్తుందనే ద్వేషంతో అమృత షాద్ నగర్ బస్టాండ్ లో స్వీపర్ గా పనిచేస్తున్న లింగంతో కలిసి గంగన్నగూడెంలో అమృత ఇంటి వద్ద లింగం ఇరువురు కలిసి సరితను మద్యం తాగించి ఆ తరువాత ఒక కర్రతో ఆమె నెత్తిపై కొట్టారు. రక్తం మడుగులో ఉన్న సరిత ముఖంపై అమృత దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చింది. అటుపై అమృత మృతదేహన్ని ఒక గోనెసంచిలో కట్టి తంగేళ్లపల్లి, చించోడు మధ్య వాగు పక్కన శవాన్ని పడేశారు.
నిందితుల్ని పట్టించిన బస్ టికెట్లు..
హత్య చేసి చేతులు దులుపుకున్నారు నిందితులు. అయితే సరిత హత్య కేసులో బస్సు టికెట్లు కీలకంగా మారాయి. సరిత మృతదేహం వద్ద రెండు బస్సు టికెట్లు లభించాయి. వాటిలో కమ్మదనం నుండి ఆమనగల్ వరకు ప్రయాణించినది అదే విధంగా షాద్ నగర్ నుండి కొందుర్గ్ కు ప్రయాణించిన టికెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టి హత్యకు గురైన మహిళ సరితగా గుర్తించారు. కమ్మదనంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తుంది. ఆమెకు గంగన్నగూడెంకు చెందిన అమృతతో పరిచయాలు ఉన్నాయి. హత్య జరిగిన రోజు కొన్ని సీసీ ఫుటేజీలో లింగం, అమృత బైక్ పై ఒక మూటను పెట్టుకొని వెళ్లినట్టు ఆధారాలు లభించాయి. అంతేకాకుండా షాద్ నగర్ బస్టాండ్ లో కూడా వీరి కదలికలను సిసి ఫుటేజ్ ద్వారా గుర్తించారు.
ద్వేషంతో జైలుపాలైన కిరాతకురాలు..
మృతురాలు సరితకు సంబంధించిన రెండు తులాల బంగారు గొలుసు, చెవి పట్టీలు, కాళ్ల గొలుసులు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు గుర్తించారు. వీటితోపాటు హత్యకు ఉపయోగించిన ఒక కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు వ్యభిచార నేపథ్యమే కారణమని ఏసిపి కుషాల్కర్ ధ్రువీకరించారు. తనకన్నా డబ్బులు ఎక్కువ సంపాదిస్తుందని అక్కస్సుతో లింగం, అమృత కుట్రపన్నీ చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు హత్య చేసిన అమృతతో పాటు సహాకరించిన లింగంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana crime news, Women died