కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవమృగం చిన్నారిపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. 9సంవత్సరాల బాలిక(9Year old girl)పై రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ ఆమె అనారోగ్యానికి కారణమయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రంగారెడ్డి (Rangareddy)జిల్లాలో కలకలం రేపింది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తించిన నిందితుడ్ని స్థానికులు పట్టుకొని చితకబాదారు. దేహశుద్ధి చేసి పోలీసు(Police)లకు అప్పగించారు.
బరితెగించిన కామాంధుడు..
జంటనగరాల పరిధిలో నిత్యం ఏదో ఓ మూల కామాంధులు బరితెగిస్తూనే ఉన్నారు. కామంతో కన్ను,మిన్ను కానరాకపోవడంతో పసివాళ్లు, చిన్నపిల్లను కూడా వదలడం లేదు. రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పొరుగు ఇంట్లో ఉంటున్న తొమ్మిది సంవత్సరాల బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. బ్రతుకు దెరువు కోసం బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పని చేసుకుంటున్నాడు యువకుడు. రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న కామాంధుడి ఇంటి పక్కనే నివాసముంటున్న 9ఏళ్ల బాలికపై కన్నేశాడు. చిన్నారి తల్లిదండ్రులు పనుల మీద బయటకు వెళ్లినప్పుడల్లా ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈవిధంగా రెండు నెలల పాటు బాలికపై రాక్షసానందాన్ని పొందాడు.
9ఏళ్ల బాలికపై రాక్షసత్వం...
గత రెండు నెలలుగా బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక ఎందుకు ఈవిధంగా ఉంటున్నావని అడగడంతో అసలు విషయం బయటపడింది. ఇంటి పక్కనే ఉంటున్న బిహార్ యువకుడు గత కొద్ది రోజులుగా తనపై బలత్కారానికి పాల్పడిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో కోపంతో రగిలిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే చిన్నారి తల్లిదండ్రులు,స్థానికులు నిందితుడ్ని పట్టుకొని చితకబాదారు. అటుపై పోలీసులకు అప్పగించారు.
కటకటాల్లోకి కామోన్మాది..
కామోన్మాదిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేయడమే కాదు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని..మరోసారి ఎవరూ ఇలాంటి కిరాతకానికి ఒడిగట్టకుండా చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు పోలీసుల్ని వేడుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో మరో కామాంధుడు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పాలిట స్కూల్‌లో టీచర్ కీచకుడిగా మారాడు. బాధిత మైనర్ బాలికకు ఆరోగ్యం బాగాలేదని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్ధిని పేరెంట్స్ ఇంటికి తీసుకొచ్చి డాక్టర్‌కు చూపించడంతో గర్భవతి అని తేలింది. మైనర్‌ని తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో స్కూల్‌లో లెక్కల మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా తెలిపింది. కోరిక తీర్చకపోతే ఎగ్జామ్స్‌లో ఫెయిల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా బాధిత బాలిక తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.