హోమ్ /వార్తలు /తెలంగాణ /

Audio Tapes: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం బూతు పురాణంపై భగ్గుమంటున్న పోలీసు అధికారులు

Audio Tapes: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం బూతు పురాణంపై భగ్గుమంటున్న పోలీసు అధికారులు

(సీఐపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఫైర్)

(సీఐపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఫైర్)

Leader vs Police:వికారాబాద్ జిల్లా తాండూర్‌ సీఐని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బూతులు తిట్టడం రచ్చ రచ్చ అవుతోంది. నియోజకవర్గంలో నేతల మధ్య అంతర్గత విభేదాలను దృష్టిలో పెట్టుకొని మహేందర్‌రెడ్డి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతే కాదు సీఐని తిట్టినందుకు ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతోంది.

ఇంకా చదవండి ...

(Syed.Rafi,News18,Mahbubnagar)

రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుంటే...వికారాబాద్ జిల్లాలో మాత్రం అధికార పార్టీ నేత ఆడియో టేపులు(Audio Tapes)సోషల్ మీడియా(Social Media)తో పాటు అన్నీ మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మంత్రిగా చేసి..ప్రస్తుతం ఎమ్మెల్సీ(MLC)గా ఉన్నటువంటి పట్నం మహేందర్‌రెడ్డి(Patnam Mahenderreddy)కి సంబంధించిన బూతుపురాణమే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు అధికార పార్టీకి చెందిన నేత బండ బూతులు తిట్టింది, ఫోన్‌లో వార్నింగ్ (Phone Warning )ఇచ్చింది ఎవరికో కాదు..స్వయానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌(Police Department‌)కి చెందిన ఓ సీఐకి కావడంతో వివాదం మరింత రచ్చకు దారి తీసింది. అసలు స్టోరీలోకి వెళ్తే వికారాబాద్‌ (Vikarabad)జిల్లా తాండూర్‌(Tandoor)లో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య ఆధిపత్యపోరు, వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈక్రమంలో నేతలు డైరెక్ట్‌గా రంగంలోకి దిగకుండా మధ్యలో అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా, తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డి(Rajender Reddy)పై బూతు పురాణం అందుకున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి(MLA Rohit Reddy)పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా ? అంటూ నోటికొచ్చినట్లుగా ఫోన్‌లో బూతులు తిట్టారు. ప్రజాప్రతినిధులు ఉపయోగించకూడని భాషతో నీ అంతు చూస్తా..! అని వార్నింగ్‌ ఇచ్చారు.

సీఐపై నోరు పారేసుకున్న ఎమ్మెల్సీ..

మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఫోన్‌ కాల్‌ చేసి తిడుతుంంటే సీఎం రాజేందర్‌రెడ్డి పద్ధతిగా మాట్లాడాలని ఎమ్మెల్సీకి సూచించారు. అందుకు కూడా ఆయన మరింత రెచ్చిపోయారు. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా? ఇప్పటినుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.. ఇప్పుడా ఆ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ఆయన మీద కోపం సీఐపై చూపించారా..

అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటే గత కొద్ది రోజులుగా తాండూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేందర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్వయంగా పార్టీ శ్రేణులే చెబుతున్న మాట. దానికి తోడు గత ఎన్నికల్లో తాండూర్ నుంచి టీఆర్‌ఎస్‌ TRS అభ్యర్ధిగా పోటీ చేసిన మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం, పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత కొరవడిందనే టాక్‌ కూడా నడిచింది. అయితే రీసెంట్‌గా ఆయనకు పార్టీ ఎమ్మెల్సీని చేయడంతో మళ్లీ ఇద్దరు నేతల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూ వచ్చాయి. ఇప్పటి వరకు అధికారం, పదవి లేకపోవడంతో సైలెంట్‌గా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ...ఎమ్మెల్సీ అయిన తర్వాత తనను లెక్క చేయరని వారిని టార్గెట్ చేస్తూ ఈవిధంగా నోరు పారేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అలాగే స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న కోల్డ్‌ వార్‌ కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు.

గులాబీ నేత సారీ చెప్పాల్సిందే..

మరోవైపు తాండూర్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బూతులు తిట్టడాన్ని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. అధికార పార్టీకి చెందిన నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ లేఖను విడుదల చేసింది. గౌరవప్రదమైన ప్రజాప్రతినిధిగా ఉన్న మహేందర్‌రెడ్డి..ప్రభుత్వ అధికారిపై నోరు పారేసుకోవడాన్ని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని..ఆయన భేషరతుగా సీఐ రాజేందర్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది.

(పోలీస్ అధికారుల సంఘం లేఖ)

నిరూపించండి..

అలాగే తాండూర్ సీఐపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించగలరా అంటూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీకి సవాల్ విసిరారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన అధికారులు. ఈవిషయంలో నేతల్ని ఊపేక్షిస్తే రాబోయే రోజుల్లో అధికారులు విద్యుత్‌ ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితి తలెత్తుతుందని లేఖ ద్వారా వెల్లడించారు.

First published:

Tags: Audio, TRS leaders, VIRAL NEWS

ఉత్తమ కథలు