హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyber Fraud: లేడీ కలెక్టర్ ఫోటోతో ఫేక్ వాట్సాప్‌ ప్రొఫైల్ క్రియేట్..అటుపై ఏం చేశారంటే

Cyber Fraud: లేడీ కలెక్టర్ ఫోటోతో ఫేక్ వాట్సాప్‌ ప్రొఫైల్ క్రియేట్..అటుపై ఏం చేశారంటే

(లేడీ కలెక్టర్ ఫోటోతోనే చీటింగ్)

(లేడీ కలెక్టర్ ఫోటోతోనే చీటింగ్)

Cyber Fraud:సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజల్నే కాదు..ఉన్నతస్థాయి వ్యక్తుల పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన ప్రొఫైల్ పిక్చర్‌తో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి రెండు లక్షల 40వేలు కాజేశారు. అలర్ట్ అయిన అధికారులు ప్రజల్ని, ప్రభుత్వ అధికారుల్ని మోసపోవద్దని అప్రమత్తం చేశారు.

ఇంకా చదవండి ...

  సైబర్ నేరాలు మెట్రోపాలిటన్ (Metropolitan)నగరాల నుంచి మండల స్థాయి పట్టణాల వరకు విస్తరించాయి. ఏమరపాటుగా ఉండే వాళ్లు, ఉన్నతస్థాయి ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. నారాయణపేట (Narayanpeta)జిల్లాలో కొందరు కేటుగాళ్లు చేసిన మోసం బయటకురావడంతో జిల్లా ఎస్పీ(SP) వెంకటేశ్వర్లు (Venkateshwarlu)జిల్లా ప్రజలతో పాటు ఉద్యోగులు, సామాన్యులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు(Cybercriminals)ట్రాక్ ఇప్పుడు పనులతో బిజీగా ఉండే వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులపై పడ్డాయి. తాజాగా ఓ సైబర్ మోసగాడు 8210616845 ఫోన్‌ నెంబర్‌(Phone number)తో నారాయణపేట జిల్లా కలెక్టర్ (Collector) డి. హరిచందన d. (Harichandana) ఫోటో వాట్సాప్‌ ప్రొఫైల్(WhatsApp‌ profile)క్రియేట్ చేసి దాని నుంచి కొంత మంది ఉన్నతాధికారులతో పాటు పరిచయస్తులకు మెసేజ్‌లు పంపాడు. ఓ వ్యక్తి నుంచి అమెజాన్ పే యాప్( Amazon Pay App)ద్వారా 2లక్షల 40వేల నగదును తమ వేయించుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెంటనే గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌(NCRP)కు కంప్లైంట్ చేసి విచారించడం జరుగుతుందని ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు.

  కలెక్టర్ పేరుతో మోసం..

  కలెక్టర్ ఫోటోతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి డబ్బులు డ్రా చేసిన వ్యక్తి  జార్ఖండ్ రాష్ట్రనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఇదే కేసుపై విచారణ జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ. అలాగే ఇలాంటి సందేశాలు వాట్సాప్, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్ ను మార్చివేసి  ఉన్నతాధికారుల ఫోటోలు పెట్టి  కొందరు కేటుగాళ్లు డబ్బులు అడుగుతున్నారని ..కావున అలాంటి వాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్స్‌ చేయవద్దని సూచించారు. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఫోన్‌ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు చేసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే సైబర్ నేరాల నుండి రక్షణ పొందేందుకు *NCRP పోర్టల్ లో కంప్లైంట్ చేయాలని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్* చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ  వెంకటేశ్వర్లు తెలిపారు.

  కొత్త తరహాలో చీటింగ్..

  సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మరెవరూ పడకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ అధికారి ప్రజలతో పాటు జిల్లా అధికారుల్ని అప్రమత్తం చేశారు. 8210616845 ఫోన్ నెంబర్ కలిగిన ఫేక్ వాట్సాప్‌తో నారాయణపేట జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ హరిచందన  ఒక ప్రకటనలో తెలిపారు. దీన్నుంచి ఎవరికైనా సందేహాలు వస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Cyber criminals, Mahabubnagar

  ఉత్తమ కథలు