హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: మూగవాడి నోటి నుంచి మాటలు..ఎలా వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు

OMG: మూగవాడి నోటి నుంచి మాటలు..ఎలా వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు

(మూగవాడి నోటి నుంచి మాటలు)

(మూగవాడి నోటి నుంచి మాటలు)

OMG:మూగ వ్యక్తి మాట్లాడాడు. మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు మాట కోల్పోయిన వ్యక్తి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం ప్రతిష్టిస్తుండగా మాట్లాడటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

  కాలజ్ఞానం చెప్పిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి(Srivirabrahmendraswamy). ఆ భక్తుడి మొర ఆలకించాడా. లేక దైవానుగ్రహం ఉండాలే కాని ఏదైనా సాధ్యమేనని నమ్మే భక్తుల విశ్వాసం నిజమైందా. మూడేళ్ల క్రితం(3Years ago) ప్రమాదవశాత్తు మాటలు నోటి మాట కోల్పోయిన ఓ వ్యక్తికి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన (Statue installation)చేస్తున్న సమయంలో షడన్‌గా మాటలు రావడం ఏమిటి. ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశమే అయినప్పటికి స్థానిక ప్రజలు మాత్రం అద్భుతంగా చూస్తున్నారు. రంగారెడ్డి( Rangareddy)జిల్లాలో ఈ తరహా సంఘటన జరగింది. కేశంపేట(Keshampet)గ్రామానికి చెందిన బ్రహ్మచారి (Brahmachari)మూడేళ్ల క్రితం ఇంట్లో కిందపడటం వల్ల మెదడుకు దెబ్బ తగిలి మాట కోల్పోయాడు. డాక్టర్ల(Doctors)కు చూపిస్తే రూ.3లక్షల(3Lacks)కుపైగా ఖర్చవుతుందన్నారు. అంత డబ్బు ఖర్చు చేసే ఆర్దిక స్తోమత లేకపోవడంతో అలాగే కాలం వెళ్లదీస్తూ వస్తున్నాడు. మూడేళ్లు గడిచిపోవడంతో బ్రహ్మచారికి ఇంకా మాటలు వస్తాయనే ఆశను అతనితో పాటు కుటుంబ సభ్యులు వదులుకున్నారు. ఈక్రమంలోనే తన ఇష్టదైవమైన వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష గ్రామస్తులు చేస్తుంటే..తాను కూడా దీక్ష చేపట్టాడు బ్రహ్మచారి.

  మాట్లాడిన మూగవ్యక్తి..

  బ్రహ్మచారి వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష చేపట్టాడు. శనివారం కేశంపేటలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టకార్యక్రమం జరిగింది. బ్రహ్మచారి మరుసటి రోజు ఉదయం ఆలయ గర్భగుడిని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట గర్భగుడిలో ఉండగా మాత్రమే మాటలు వచ్చాయి. అతడ్ని బయటకు తీసుకురావడంతో మాటలు రాకపోవడం గమనించిన స్థానికులు 11బిందెలతో స్వామివారికి అభిషేకం చేయడంతో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం వల్లే ఈ అద్భుతం జరిగిందని గ్రామస్తులు నమ్ముతున్నారు.

  వీరబ్రహ్మంగారి మహత్యమేనట..

  ఇదంతా నిజమేనా అనే సందేహాలు వ్యక్తమవడంతో గ్రామస్తులు క్లారిటీ ఇచ్చారు. మూడేళ్ల క్రితం బ్రహ్మచారికి మాటలు రాని విషయం వాస్తవమేనని ధృవీకరించారు. వైద్యాధికారులు మాత్రం దీన్ని కేవలం దైవభక్తిగానో , అద్భుతంగానో  చూడటానికి అవకాశం లేదంటున్నారు. బ్రెయిన్‌కు గాయమైనప్పుడు ఒక్కొక్కసారి మాటలు కోల్పోవడం జరుగుతుందని..తిరిగి మెదడుకు తగిలిన గాయం మానిపోగానే పూర్వం మాట్లాడే విధంగానే మళ్లీ మాటలు వస్తాయని డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ దామోదర్‌ చెప్పారు. ఏది ఎలా ఉన్నా బ్రహ్మచారి కుటుంబ సభ్యులు మాత్రం బ్రహ్మగారి కాలజ్ఞానమే నిజమవుతుంటే...ఇలాంటివి జరగినప్పుడు సందేహించాల్సిన అవసరం ఏముంది అని తమ వాదనకు బలం చేకూర్చుతున్నారు. మూగవ్యక్తికి బ్రహ్మంగారి గుడిలో మాటలు వచ్చాయనే వార్త మాత్రం జిల్లాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Rangareddy, VIRAL NEWS

  ఉత్తమ కథలు