హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shadnagar: నవమి ఉత్సవాల్లో అద్భుతదృశ్యం శోభయాత్రలో కనిపించిన మతసామరస్యం

Shadnagar: నవమి ఉత్సవాల్లో అద్భుతదృశ్యం శోభయాత్రలో కనిపించిన మతసామరస్యం

(మతసామరస్యానికి ప్రతీక)

(మతసామరస్యానికి ప్రతీక)

Religious harmony:తెలంగాణలో హిందు, ముస్లిం ఐకమత్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పండుగలు, పవిత్ర దినాల్లో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకునే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. తాజాగా షాద్‌నగర్‌లో శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొన్న హిందూ యువతకు ముస్లిం సోదరులు చల్లని మంచినీళ్లు అందజేసే మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.

ఇంకా చదవండి ...

  రెండు తెలుగు రాష్ట్రాలు మతసామరస్యానికి ప్రతీక అని చాలా సందర్భాల్లో నిరూపణైంది. తాజాగా తెలంగాణ (Telangagana)రాష్ట్రం రంగారెడ్డి (Rangareddy)జిల్లాలో జరిగిన శ్రీరామనవమి(sriramanavami) ఉత్సవాల వేళ అలాంటి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఓ అద్భుతమైన సందర్భం అందర్ని ఆకట్టుకుంది. షాద్‌నగర్‌ (Shadnagar)పట్టణంలో రాత్రి హిందూ వాహిని( Hindu Vahini)ఆధ్వర్యంలో చేపట్టిన శోభయాత్ర (Shobhayatra)కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. దీనికి వేలాది మంది యువకులు తరలివచ్చారు శోభయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక రైల్వే స్టేషన్( Railway station)నుండి రాత్రి ఫరూక్ నగర్ (Farooq Nagar)పోయే దారిలో యువత ఆటపాటలతో కోలాహలంగా వేడుక జరుపుకున్నారు. స్థానిక రైతుకాలనీలో చెన్నమ్మ హోటల్ (Chennamma Hotel)వద్ద హిందూ సోదరుల కోసం స్థానిక ముస్లిం యువత కొందరు మంచినీళ్ల ఏర్పాటు చేశారు. చల్లని నీళ్లతో వారికి స్వాగతం పలికారు. యువత ఆటపాటలతో ఓవైపు చిందులు వేస్తూ ఉండగా దప్పికతో దాహం తీర్చుకునేందుకు ముస్లిం సోదరులు వారికి మంచినీళ్లు(Cool water) అందజేయడం అందర్ని ఆకట్టుకుంది. షాద్‌నగర్‌లో ముస్లిం సోదరులు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శోభయాత్రలో హిందూవులతో కలిసి భాగస్వాములు కావడం, వారికి తోచిన సాయం చేయడం చూసిన స్థానికులైతే సంబరపడిపోయారు.

  మతసామరస్యానికి ప్రతీక..

  ఓవైపు ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం..మరోవైపు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఈసన్నివేశం చూసిన వాళ్లంతా హిందూ, ముస్లిం భాయి భాయి అన్న సామెతను గుర్తుకు తెచ్చుకున్నారు. ఉపవాద దీక్షలు విడిచే సమయం కావడంతో ముస్లిం సోదరులు చాలా మంది శోభయాత్రలో పాల్గొన్న యువకులకు చల్లని మంచినీళ్ళను అందజేసి సకాలంలో వారి దాహార్తిని తీర్చారు. పలువురికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మతసామరస్యాన్ని చాటుకున్నారు.

  అపూర్వ సంఘటన..

  శ్రీరామనవమి వేడుకల్లో ఈ ఘటన అందరినీ అమితంగా అలరించింది. హిందూ సోదరులు, ముస్లిం యువత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేయడం షాద్ నగర్ పట్టణంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణానికి తెరతీసింది. శోభ యాత్ర సైనికులకు మంచి నీళ్ల ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల్లో సయ్యద్ జాఫర్, సయ్యద్ ముజ్జు, మహ్మద్ హమీద్, మహ్మద్ షాకేర్, మహ్మద్ మతీన్, మహ్మద్ రవుఫ్, సయ్యద్ సైఫ్, సయ్యద్ ఇస్మాయిల్, ఆర్బాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈతరహా సంప్రదాయం భవిష్యత్ కాలంలో కూడా కొనసాగాలని స్థానికులు కోరుతున్నారు. హిందువులకు ముస్లింలు, ముస్లీం సోదరులకు హిందూ యువత సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నారు స్థానికులు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Rangareddy, Srirama navami

  ఉత్తమ కథలు