హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ప్రపంచ స్థాయి సదుపాయాలతో క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం

Hyderabad: ప్రపంచ స్థాయి సదుపాయాలతో క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం

X
ప్రపంచస్థాయి

ప్రపంచస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి

Hyderabad: భారతదేశంలో డిజిటల్ పెట్ పిఇటి ఎంఆర్, డిజిటల్ పెట్ పిఇటి సిటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రి ఒమేగా హాస్పిటల్స్ అని డాక్టర్ మోహన వంశీ వెల్లడించారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపోర్టర్ : రవీందర్

లొకేషన్ : హైదరాబాద్

క్యాన్సర్‌లో అగ్రగామిగా నిలిచిన ఒమేగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి సదుపాయాలతో, అత్యంత అధునాతన టెక్నాలజీతో 500 లకు పైగా పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన వంశీ సిహెచ్ మాట్లాడుతూ.. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు అందించాలనే ఏకైక లక్ష్యంతో గచ్చిబౌలిలో ఒమేగా హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చాలా మంది రోగులకు గుండె, ఆర్థోపెడిక్, మూత్రపిండము, పల్మనరీ, న్యూరోలాజికల్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలకు ఇంటర్ డిసిప్లినరీ కేర్ అవసరమని, రోగుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తాము సమగ్ర క్యాన్సర్ సంరక్షణను అందించడానికి, వివిధ సూపర్ స్పెషాలిటీల సేవలను ఐదు అంతస్తులలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

 Hyderabad: నగరవాసులకు బిగ్ అలర్ట్.. మరో 10 రోజుల పాటు ట్రాఫిక్ సమస్యలు..

వైద్య రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం ఎంతో అవసరం అన్నారు. ఒమేగా హాస్పిటల్ లో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పనిచేసే రేడియేషన్ మెషిన్ ఎథోస్(ETHOS) విప్లవాత్మకమైన కొత్త థెరపీని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇది రోగి కేంద్రీకృతంగా పనిచేస్తుందని వివరించారు. చికిత్సకు సంబంధించి ప్రారంభ ప్రణాళిక నుండి చివరి వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుందని తెలిపారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పనిచేసే ఎథోస్ ఉపయోగించి, పెట్/ఎంఆర్-గైడెడ్ అడాప్టివ్ రేడియోథెరపీని ప్రారంభించామని వెల్లడించారు. ఇది క్యాన్సర్ రేడియేషన్ చికిత్సలో ఒక విప్లవం అని పేర్కొన్నారు. ఈ విధానంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి(చూడటం, ఆలోచించడం, ప్లాన్ చేయడం, చికిత్స అందించడం) చికిత్సను అందిస్తుందని వివరించారు. భారతదేశంలో డిజిటల్ పెట్(PET) ఎంఆర్, డిజిటల్ పెట్ (PET) సిటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రి ఒమేగా హాస్పిటల్స్ అని డాక్టర్ మోహన వంశీ వెల్లడించారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ICU, హై ఎండ్ క్యాథల్యాబ్ ఫెసిలిటీస్ తో మా అనుభవజ్ఞులైన క్రిటికల్ కేర్ టీమ్ 24 గంటలు అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటామన్నారు.

First published:

Tags: Hyderabad, Local News, Telangana

ఉత్తమ కథలు