హోమ్ /వార్తలు /తెలంగాణ /

Family sentiment: విడిపోవాలని కోర్టుకొచ్చిన భార్యభర్తలు .. వాళ్ల కూతురికి జడ్జీ ఏం చెప్పిందో తెలుసా..?

Family sentiment: విడిపోవాలని కోర్టుకొచ్చిన భార్యభర్తలు .. వాళ్ల కూతురికి జడ్జీ ఏం చెప్పిందో తెలుసా..?

Family sentiment

Family sentiment

Family sentiment: కలిసి జీవించడమే కష్టం. కుటుంబం లేని జీవితం వ్యర్ధం ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఓ న్యాయమూర్తి ..విడిపోవాలనుకున్న దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఆ టైమ్‌లో వాళ్ల బిడ్డను తన ఒడిలో కూర్చొబెట్టుకొని తన బిడ్డగా చూసుకున్న తీరు అందరి మనసుల్ని గెలుచుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Rangareddy, India

(Syed Rafi, News18,Mahabubnagar)

భార్య భర్తలు మనస్పర్ధల కారణంగా విడిపోవడం చాలా సాధారణం. కాని కలిసి జీవించడమే కష్టం. కుటుంబం లేని జీవితం వ్యర్ధం ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే విడిపోలనుకొని తన దగ్గరకు వచ్చిన దంపతులకు ఓ న్యాయమూర్తిjudge కౌన్సిలింగ్ (Counseling)ఇచ్చింది. ఆ టైమ్‌లో వాళ్ల బిడ్డను తన ఒడిలో కూర్చొబెట్టుకొని తన బిడ్డగా చూసుకున్న తీరు అందరి మనసుల్ని గెలుచుకుంది. రంగారెడ్డి (Rangareddy)జిల్లా షాద్‌నగర్ (Shadnagar)కోర్టులో  జరిగిన లోక్ అదాలత్ (Lok adalat)కార్యక్రమంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. న్యాయమూర్తిగా ఉన్న మహిళా అధికారి దంపతులకు ఇచ్చిన కౌన్సిలింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Sick village : ఆ జబ్బుతో ఊరి జనం పేషెంట్‌లుగా మారుతున్నారు .. ఎందుకో తెలియక చనిపోతున్నారు

అందరి మనసుల్ని ఆకట్టుకున్న దృశ్యం..

మంచి చెప్పేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. గత 7-8ఏళ్లుగా విడిపోయిన భార్య భర్తలు విడాకుల కోసం లోక్‌ అదాలత్‌ని ఆశ్రయించారు. అయితే విడిపోవడం వల్ల వచ్చే పరిస్థితులు, కలిసి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను ఓ మహిళా న్యాయమూర్తి ఎంతో ఓపికతో దంపతులకు చెప్పేందుకు ఎంతో ఓపికగా ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సీనియర్ సివిల్ జడ్జీగా సీఎం రాజ్యలక్ష్మి లోక్ అదాలత్ కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా ఓ సంఘటన మీడియా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. మాడుగులకు చెందిన పల్లె వెంకటయ్య సుజాత దంపతులకు సంబంధించిన భార్యాభర్తల వివాద కేసును పరిష్కరించే ప్రయత్నం చేశారు.

అమ్మతనాన్ని చాటుకున్న న్యాయమూర్తి..

ఎనిమిదేళ్ల కూతురు ఆద్య తల్లి వెంట రాగా న్యాయమూర్తి రాజ్యలక్ష్మి ఆద్యను ఆప్యాయంగా పలకరించి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. తనకు ఆప్యాయంగా బిస్కెట్ ఇచ్చారు. మరోవైపు తల్లిదండ్రులు కేసులో ఉండగా చిన్నారి కూతురిని జడ్జి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీకు అమ్మ కావాలా? నాన్న కావాలా అంటూ ప్రశ్నించారు. అమ్మ కావాలని చెప్పగా నాన్న లేకపోతే మీ ఫ్రెండ్స్ నిన్ను అడగరా? స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు అమ్మానాన్నలు ఇద్దరు ఉండాలి కదా? అని జడ్జ్ అడగగానే పాప ఆద్య తనకు ఇద్దరు కావాలని న్యాయమూర్తి ముందు చెప్పింది. విడిపోదామనుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరు తనతోనే ఉండాలని అర్ధం చేసుకున్న పసిపాప లేత మనసు న్యాయమూర్తి మాటలకు ఇద్దరు కావాలంటూ చెప్పింది.

కలిపేందుకు ప్రయత్నించిన జడ్జీ ..

ఈ సంఘటనతో న్యాయమూర్తి అమ్మతనాన్ని గుర్తుచేసింది. అనుకోని ఈ సంఘటనతో చలించి పోయిన న్యాయమూర్తి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని కోరుతూ కౌన్సిలింగ్ చేపట్టారు. ప్రతి ఒక్కరినీ కదిలించే ఈ మానవీయ ఘటన న్యాయమూర్తిలో అమ్మ కోణాన్ని ప్రదర్శించారు.తన కన్న బిడ్డల మాదిరిగా భార్యాభర్తలు ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేయడం లోక అదాలత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తప్పు, ఒప్పులు ఎవరివైనా కానివ్వండి తమకు పుట్టిన పిల్లలు మాత్రం తల్లిదండ్రుల వల్ల బాధపడకూడదని, సమాజంలో పిల్లలు నిందించబడకూడదని భార్యాభర్తలకు న్యాయమూర్తి సూచించారు. పాప కోసం తల్లిదండ్రులు కలిసి ఉండాలని సూచించారు.

బ్రేకింగ్ న్యూస్: ఫామ్ హౌస్ డీల్ కేసు..నిందితులకు ఏసీబీ కోర్టులో భారీ షాక్

ఆలోచించుకునే అవకాశం..

పిల్లలు ఏం తప్పు చేశారని వారికి తల్లిదండ్రులు శిక్ష విధించకూడదని హితవు పలికారు. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన ఉండాలని, ఘర్షణలు  వివాదాలు జరిగితే వాటిని అధిగమించి సంసారాన్ని చక్కదిద్దుకోవాలని భార్యాభర్తలకు సూచించారు. అంతేకాకుండా న్యాయమూర్తి రాజ్యలక్ష్మితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు జీవన్ సూరజ్ సింగ్, సాంబశివ అదే విధంగా సీఐ నవీన్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మహిళా న్యాయవాది సబియా సుల్తానా, శ్రీనివాస్ రెడ్డి భార్యాభర్తలను కలిసి ఉండాల్సిందిగా సూచించారు. భార్యాభర్తలు బాగా ఆలోచించుకొని కోర్టుకు రావాలని తిరిగి కేసును వాయిదా వేశారు. న్యాయమూర్తి హోదాలో ఉన్న రాజ్యలక్ష్మి ఎంతో ఓర్పుతో నేర్పుగా కౌన్సిలింగ్ ఇచ్చిన తీరు లోక్ అదాలత్ లో అక్కడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

First published:

Tags: Family dispute, Ranga reddy, Telangana News

ఉత్తమ కథలు