హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news : చెరువులో ఈతకు దిగిన నలుగురు చిన్నారులు .. కొద్ది సేపటికే ..

Sad news : చెరువులో ఈతకు దిగిన నలుగురు చిన్నారులు .. కొద్ది సేపటికే ..

rr vishadam(FILE PHOTO)

rr vishadam(FILE PHOTO)

Sad news: రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆదివారం నాడు నలుగురు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. ఈత కొడతామని చెరువులోకి దిగిన నలుగురు జలసమాధి అయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Rangareddy, India

రంగారెడ్డి(Rangareddy)జిల్లాలో విషాదం నెలకొంది. ఆదివారం(Sunday) నాడు నలుగురు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. ఈత కొడతామని చెరువులోకి దిగిన నలుగురు జలసమాధి అయిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో నాలుగు కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. ఒకేసారి నలుగురు విద్యార్ధులు మృతి చెందడంతో బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ఆర్తనాధాలతో ఆ ప్రాంతమంతా అరణ్యరోదనగా మారింది.

OMG : మృత శిశువును పీక్కుతిన్న కుక్కలు, పందులు .. ఆ హాస్పిటల్‌లో అందరూ చూస్తుండగనే జరిగింది

నలుగురు జలసమాధి..

చెరువు పిల్లల ప్రాణాల్ని మింగేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత 26వ తేదిన ముగ్గురు చిన్నారు వెంచర్‌ కోసం తీసిన గుంతలో పడి చనిపోయారు. ఈసంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మరో విషాదం నెలకొంది. తాడిపర్తి గ్రామ పంచాయతీ గొల్లగూడ గ్రామంలోని ఎర్రగుంట చెరువులో పడి నలుగురు విద్యార్దులు మృత్యువాత పడ్డారు. దసరా సెలవులు ఇవ్వడంతో అబ్దుల్ రహీం కుటుంబానికి చెందిన బాలికతో పాటు మరో ముగ్గురు బాలురు చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. ఎర్రగుంట చెరువులోకి దిగిన తర్వాత లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు.

ఈత సరదా ప్రాణం తీసింది..

ఈత సరదా నలుగురు ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయారు. చనిపోయిన నలుగురు 15ఏళ్ల వయసులోపు వారే కావడం విశేషం. నలుగురు నీళ్లలో మునిగి ఊపిరాడక చనిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. మృతి చెందిన చిన్నారుల్లో 9ఏళ్ల ఇమ్రాన్‌, 10సంవత్సరాల రేహాన్, 12ఏళ్ల ఖలీద్‌, 14సంవత్సరాల సమ్రీన్‌ ఉన్నట్లుగా తేల్చారు.

OMG : చిన్న కొడుకు సహాయంతో పెద్దకొడుకుని కడచేర్చిన కన్నతల్లి .. వాళ్ల మధ్య అసలేం జరిగిందంటే..

వారం రోజుల్లో పది మంది..

చిన్నారులు మృతి చెందిన విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని మృతదేహాల్ని వెలికి తీయించారు. ఆడుకుంటామని వెళ్లిన పిల్లలు చెరువులో విగతజీవులుగా కనిపించడం చూసి చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆరు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలంలోని షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల సోలిపూర్ శివారులోలోని ఓ వెంచర్ నీటి గుంతలో ముగ్గురు చిన్నారులు పడి దుర్మరణం పాలయ్యారు. సెప్టెంబర్‌ 28న మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కూడా పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తూ ఈత కొట్టడానికి చెరువులోకి దిగిన 9మందిలో ముగ్గురు మృతి చెందారు. వారం వ్యవధిలోనే మొత్తం 10మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Ranga reddy, Students, Telangana News

ఉత్తమ కథలు