(Syed Rafi, News18,Mahabubnagar)
సోషల్ మీడియా(Social medi)లో వచ్చే వార్తలు, షేర్ చేస్తున్న ఫోటోలు(Photos), వీడియోలు(Videos), ప్రజల్లో తెలియని భయాందోళనలను కలిగిస్తున్నాయి. వదంతుల్ని వాస్తవాలుగా ప్రచారం చేయడంతో అధికారులు సైతం ఏది నిజమో..ఏది అబద్ధమో తెలుసుకునేందుకు ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. సోషల్ మీడియాను జనం బాగా ఫాలో అవడం కారణంగా ఏప్పటివో పాత ఫోటోలు, వీడియోలు తిరిగి ఇప్పుడే జరిగినట్లుగా అనేక గ్రూప్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. రంగారెడ్డి(Rangareddy)జిల్లా షాద్‌నగర్(Shadnagar) టౌన్‌లో కూడా అలాంటి పరిస్థితే పోలీసులు, ఫారెస్ట్(Forest)అధికారులను పరుగులు పెట్టించింది.
పులి పుకార్లతో పరేషాన్..
పుకార్లు వాస్తవాలకంటే వేగంగా జనాల్లోకి వెళ్తాయి. ఇది నిజమని రంగారెడ్డి జిల్లా పోలీసులు నిరూపించారు. షాద్ నగర్ పట్టణంలోని రెండవ వార్డ్ పరిధిలోని తిలక్ నగర్‌లో చిరుత పులి సంచరిస్తోందని సోమవారం సాయంత్రం ప్రచారం జరిగింది. ఈ చిన్న మాట చివరకు ప్రజాప్రతినిధులకు అధికారులకు చేరడంతో వారు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. రెండవ వార్డ్ పరిధిలో చిరుత పులి సంచరించిందంటూ ఓ యువకుడు స్థానిక అధికారులకు సమాచారం అందజేశాడు. దీంతో స్థానిక పోలీసులు ఆ ప్రాంతంలో పులి జాడ కోసం వెదకసాగారు. అదేవిధంగా అడవిశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు.
పులి లేదు గిలి లేదు..
అయితే చిరుత పులి సంచరిస్తుంది అని చెప్పిన వారు కొందరు ఇదే అదునుగా భావించి సోషల్ మీడియాలో పులి ఫోటోలను పోస్టింగ్ చేస్తున్నారు. దట్టమైన అడవిలో పులి సంచరిస్తున్న ఏవో పాత ఫోటోలను షేర్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు వాస్తవం ఏమిటో ఎవరికి తెలియదు. అప్పుడే ఫోటోలు తీసినట్టు అవి సంచరిస్తున్నట్లు భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆయా మీడియా గ్రూపుల్లో సైతం ఒక వార్త ప్రచారం కావడం మూడు ఫోటోలను ప్రచారం చేశారు. ఓవైపు పోలీసులు పులి కనిపించిందన్న దగ్గర కాపలా కాస్తున్నారు. మరోవైపు కమ్మదనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అజీజ్ అటవీశాఖ సిబ్బందితో కలిసి సంఘటన స్థలంలో పరిశీలించారు. అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజ్‌లు, పులి సంచరించిన ఆనవాళ్లను ఏమైనా దొరుకుతాయని వెదికారు. అంతా అబద్ధమని తేల్చారు.
ఫేస్ న్యూస్ వైరల్ చేస్తే ..
ఈతరహా ప్రచారాలు, పుకార్లను సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోలు, వీడియోలను నమ్మవద్దని అటవీశాఖ అధికారి అజీజ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, పోస్ట్‌లు పెట్టి అనవసరంగా ప్రజల్ని భయకంపితులను చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు సైతం ఇలాంటి వార్తలను పూర్తిగా తెలుసుకోకుండా భయాందోళనకు గురికావద్దని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rangareddy, Tiger, VIRAL NEWS