హోమ్ /వార్తలు /తెలంగాణ /

Heavy rain : రంగారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించిన భారీ వర్షం .. వంతెన తెగడంతో రాకపోకలు బంద్

Heavy rain : రంగారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించిన భారీ వర్షం .. వంతెన తెగడంతో రాకపోకలు బంద్

(HEAVY RAIN)

(HEAVY RAIN)

Heavy rain : రంగారెడ్డి జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి షాద్‌నగర్ నియోజకవర్గంలోని వంతెన తెగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పులుసు మామిడి గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

(Syed Rafi, News18,Mahabubnagar)

భారీ వర్షానికి రంగారెడ్డి జిల్లాలో తెగిన వంతెన

శ్రీరంగాపూర్, అప్పారెడ్డి గూడ సమీపంలో ఉన్న వంతెన ధ్వంసం

వంతెన తెగిపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు

రాకపోకలకు తీవ్ర అంతరాయం

ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం

భారీ వర్షానికి ఇంట్లోకి చేరిన నీరు..

రంగారెడ్డి (Ranga Reddy)జిల్లాలోని షాద్‌నగర్(Shadnagar)నియోజకవర్గం శ్రీరంగాపూర్(Srirangapur), అప్పారెడ్డిగూడ (Appareddiguda)మధ్య వర్షం తాకిడికి బ్రిడ్జీ(Bridge) ధ్వంసమైంది. వంతెన తెగిపోవడం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా ప్రయాణికులు సిటీటైమ్స్‌(Citytimes)కు తెలిపారు. షాద్‌నగర్ నుండి కొందర్‌కు వెళ్లే ముఖ్య రహదారి వంతెన తెగిపోవడంతో బస్సుల(Buses)తో పాటు పలు ప్రైవేట్ వాహనాలు(Private vehicles)ఎక్కడికక్కడే ఆగిపోయినట్లు సిటీటైమ్స్ ప్రతినిధికి బాధితులు తెలిపారు. ప్రమాదకరంగా వరద తాకిడి ఎక్కువైందని స్థానికులు తెలిపారు.

Cyber ​​fraud : కొత్త ర‌కం మోసం .. ఎంటో తెలుసుకోక‌పోతే మీ అకౌంట్‌లో డబ్బు మాయంపొంచివున్న ముప్పు..

బుధవారం రాత్రి షాద్‌నగర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. వాగు ప్రమాదకరస్థాయిలో పొంగిపొర్లుతోందని చెప్పారు. హెచ్చరికలు జారీ చేసిన కాసేపట్లోనే వంతెన ధ్వంసం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రయాణికులు తమ చేరుకోవలసిన గమ్యానికి చుట్టూ తిరిగి వెళుతున్నారు. అయితే మరికొందరు గత్యంతరం లేక అక్కడే ఆగిపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

భారీ వర్షానికి ఇంట్లోకి నీరు..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పులుసు మామిడి గ్రామంలో నీరటి అంజమ్మ ఇంట్లోకి వర్షం నీరు చేరుకుంది. గ్రామంలో చెరువు ఆనకట్ట ఎత్తు పెంచి తూము మూసి వేయడంతో చెరువు నుండి ఇంట్లోకి నీరు ప్రవేశించినట్టు బాధితురాలు నీరటి అంజమ్మ, గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఎంపీటీసీ మల్లేష్, గ్రామ సర్పంచ్ షరీఫా బేగం, జాంగిర్ బాధితురాలిని సురక్షిత స్థలానికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా వారు పేర్కొన్నారు.

First published:

Tags: Rangareddy, Telangana rains

ఉత్తమ కథలు