(Syed Rafi, News18,Mahabubnagar)
రానున్న రోజుల్లో గ్రామపంచాయతీలు డిజిటల్ కీ లకు వేదికలుగా మారనుండటంతో ప్రజలకు ప్రయోజనాలు కలిగి అక్రమాలకు చెక్ పడే అవకాశాలు వున్నాయి. ప్రజలకు అందాల్సిన సేవల విషయంలో ఆలస్యం తలెత్తుతుండడంతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ కి సదుపాయాన్ని కల్పించింది. ఇందులో భాగంగానే రంగారెడ్డి (Rangareddy)జిల్లా షాబాద్ (Shabad)మండల పంచాయతీ అధికారి మండలంలోని 41 గ్రామ కార్యదర్శిలకు డిజిటల్ కీ(Digital key) లను అందజేశారు. పంచాయతీల్లో ప్రధానంగా పారిశుధ్యం ఇంటి పన్నుల వసూలు హరితహారం నర్సరీల నిర్వహణతో పాటు గ్రామసభల నిర్వహణ తదితర 34 రకాల పనులు కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు అదనంగా మరికొన్ని రకాల పనులకు ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తుంది దీంతో అధికారులకు పని ఒత్తిడితోపాటు ప్రజలకు సంబంధిత ధ్రువపత్రాల జారీలో ఆలస్యం అవుతోంది. డిజిటల్ కీ లతో ఆలస్యానికి చెక్ పడనున్నట్లు గ్రామపంచాయతీ అధికారులు చెబుతున్నారు. పంచాయతీ స్థాయిలో జారీ చేసే జనన దోపత్రాలు, ఇంటి యజమాని మరణిస్తే అతని పేరున ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, వ్యవసాయ భూములు, ఆస్తుల మార్పిడి, అవసరమైన డెత్ సర్టిఫికెట్స్ లాంటి సేవలు వేగంగా అందనున్నాయి.
వేగంగా ప్రభుత్వ సేవలు ..
గ్రామీణ ప్రాంతాల్లో జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిరంతరం సాగే ప్రక్రియ కావడంతో వివరాలను ఎప్పటికప్పుడు పంచాయతీ రికార్డులో నమోదు చేస్తున్నారు దోపత్రాలు నేరుగా జారీ చేసే విషయంలో కార్యదర్శులు వివిధ కారణాల రీత్యా ఆలోచించేస్తున్నారు కొన్నిసార్లు కార్యదర్శులకు తెలియకుండా కిందిస్థాయి స్థిబ్బంది మాన్యువల్ గా ఇస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి..దీంతో ఇకనుంచి అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడనుంది.
అవినీతికి అవకాశం తక్కువే..
జనన, మరణ ధ్రువీకరణ పత్రల జారీలో కొన్నిచోట్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నట్లు మరికొన్నిచోట్ల కార్యదర్శిలే తప్పుడు దృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాలు డిజిటల్ కి ద్వారానే ఇవ్వడంతో అక్రమాలకు చెక్ పడనుందని అధికారులు గుర్తించి ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి గ్రామపంచాయతీలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rangareddy, Telangana News