హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bathukamma sarees: కూరగాయల మూటలు, చేనుకు పరదాలుగా మారిన బతుకమ్మ చీరలు ..ఎక్కడ జరిగిదంటే..?

Bathukamma sarees: కూరగాయల మూటలు, చేనుకు పరదాలుగా మారిన బతుకమ్మ చీరలు ..ఎక్కడ జరిగిదంటే..?

bathukamma sares

bathukamma sares

Bathukamma sarees: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులు, మహిళల కోసం దసరా కానుకగా తయారు చేయించి ఉచితంగా పంపిణి చేసిన బతుకమ్మ చీరలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వచ్చినట్లుగానే ఈసారి కూడా చీరల నాణ్యతపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana) ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులు, మహిళల కోసం దసరా కానుకగా తయారు చేయించి ఉచితంగా పంపిణి చేసిన బతుకమ్మ చీర(Bathukamma sarees)లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వచ్చినట్లుగానే ఈసారి కూడా చీరల నాణ్యతపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. అందరూ బతుకమ్మ సంబురాల్లో చీరలు కట్టుకోవాలని ప్రభుత్వం భావించి పంపిణి చేస్తుంటే ..చాలా చోట్ల అవి మహిళలు కట్టుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదనే సంకేతాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ఒక్కో చీరను 300రూపాయలు ఖర్చు చేసి తయారు చేయించామని చెబుతుంటే .. ఇవి మాత్రం వేర్వేరు అవసరాల కోసం కేవలం 50రూపాయలు, పాతిక రూపాయలకు కొనుగోలు చేస్తూ మల్టీ పర్సపస్‌గా ఉపయోగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీడియా(Media),సోషల్ మీడియా(Social media) ప్రత్యక్షమవుతున్నాయి.

Munugode | EC: నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక ..6న కౌంటింగ్ ..షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

కూరగాయల మూటలు గట్టిన చీరలు ..

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ..ప్రశంసలతో పాటు విమర్శలు రావడం సర్వ సాధారణం. ఈసంవత్సవరం తెలంగాణ ప్రభుత్వం పంపిణి చేసిన బతుకమ్మ చీరల విషయంలో కూడా అదే జరుగుతోంది. సుమారు 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోటి 20లక్షల చీరలను తయారు చేయించి మహిళలకు అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే చీరల పంపిణి కార్యక్రమంలోనే చాలా చోట్ల నాణ్యత లేవని కొందరు మండిపడిన సందర్భాలు మీడియా దృష్టికి వచ్చాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో బతుకమ్మ చీరలు పంట చేలకు పరదాలుగా కట్టారు స్థానికులు. కేవలం నాణ్యత లేకపోవడం, సిల్క్ చీరలు కావడం వల్లే వీటిని మహిళలు కట్టుకోవడానికి ఇష్ట పడటం లేదని తెలుస్తోంది.

పరదాలుగా మారిన చీరలు..

ముఖ్యంగా బహిరాబాద్‌ మండలానికి 11,316చీరలు కేటాయిస్తే అందులో కేవలం 20శాతం బతుకమ్మ చీరలను మాత్రమే మహిళలు తీసుకెళ్లారు. మిగిలిన చీరలు రేషన్‌ షాపు డీలర్ల దగ్గర నిల్వ ఉండటంతో వాటిని ఒక్కో చీరను 50రూపాయలకు కొనుగోలు చేసుకొని చెనుల్లో అడవి పందులు, ఇతర జంతువులు చొరబడకుండా పరదాలుగా కడుతున్నారు.

Bathukamma 2022: సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు .. చివరి రోజు పూలకు భారీగా పెరిగిన డిమాండ్

వేర్వేరు అవసరాల కోసం ..

జహిరాబాద్‌ మండలంలో బతుకమ్మ చీరలను ఈవిధంగా ఉపయోగిస్తే ...థరూర్‌ మండలంలో ఏకంగా బతుకమ్మ చీరలను కూరగాయలు, ఆకు కూరలను మూటలు కట్టడానికి ఉపయోగించారు. ఆవిధంగా బతుకమ్మ చీరలతో కూరగాయలను మూటలు కట్టిన దృశ్యం ధరూర్‌ సంతలో ఓ మహిళ తీసుకురావడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇక్కడికి వచ్చిన కొందరు ఇవి బతుకమ్మ చీరలు కదా ఇలా చేశారంటని అడిగితే ఇవి పాల్టిస్టర్ చీరలని కట్టుకోవడానికి వీలుగా లేకపోవడం వల్లే తాము ఈవిధంగా ఉపయోగిస్తున్నామని సమాధానం చెప్పింది ఓ మహిళ.

Published by:Siva Nanduri
First published:

Tags: Bathukamma 2022, Telangana News, Vikarabad

ఉత్తమ కథలు