హోమ్ /వార్తలు /తెలంగాణ /

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం

X
యూనివర్సీటీలో

యూనివర్సీటీలో విద్యార్థిని పట్ల అమానుషం

Hyderabad: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్కి చెందిన యువతి యూనివర్సిటీలో చదువుకుంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్కి చెందిన యువతి యూనివర్సిటీలో చదువుకుంటుంది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో తనపై లైంగిక దాటి చేసినట్టు తోటి విద్యార్థులు చెప్పడంతో కలకలం మొదలైంది. పోలీసుల యూనివర్సిటీకి వచ్చి విచారణ చేపట్టారు. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు దారుణానికి వడిగట్టిన ప్రొఫెసర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  విద్యార్థిని విదేశీయురాలు కావడంతో లైంగిక దాడి ఘటన సంచలనంగా మారింది.  హిందీ ప్రొఫెసర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్​పై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ముందు ధర్నా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.

ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసిన యూనివర్సీటీ..

సెంట్రల్ యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ విద్యార్థినిపై హత్యాచారయత్నం ఘటన కలకలంగా మారిన విషయం తెలిసిందే.  నిన్న రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన బాధిత విద్యార్థిని. హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ బాధిత విద్యార్థిని కార్లో తీసుకెల్లిన ప్రొఫెసర్ రవి రంజన్.నేరుగా బాధితులని తన ఇంటికి తీసుకెళ్లిన ప్రొఫెసర్..ఇంట్లో బాధిత యువతకి మద్యం తాగించిన ప్రొఫెసర్ రవి రంజన్. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రొఫెసర్.

బాధిత యువతి ప్రతిఘటించడంతో ఆమెను  రవి రంజన్ కొట్టాడు. ఆ తర్వాత  తిరిగి బాధిత యువతని స్వయంగా కారులో తీసుకువచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గరకుక వచ్చి వదిలిపెట్టాడు. ఈ క్రమంలో షాకింగ్ కు గురైన యువతి..  నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్ పై మూడు కేసులున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా..  నెల రోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్ పై రవిరంజన్  ఉపన్యాసం ఇచ్చారు.  రంజన్ గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదని విద్యార్థులు తీవ్ర  నిరసన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Crime news, HCU, Hyderabad, Local News, Telangana

ఉత్తమ కథలు